Horoscope Today:ఈ రాశుల వారికి ఈరోజు అన్నీ వృథా ఖర్చులే..తగ్గించుకుంటే బెటర్‌!

కర్కాటకరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆర్థిక లబ్ధి ఉంటుంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ కథనంలో..

New Update
Horoscope Today

Horoscope Today

మేషం: మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాలలో బాధ్యతతో వ్యహరించాలి. కీలక వ్యవహారాల్లో మొండి పట్టుకు పోకుండా కాస్త పట్టు విడుపు ధోరణితో ఉండాలి. కుటుంబ సభ్యుల అవసరాలు, కోరికలు మొట్టమొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలి. కోపం అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. 

Also Read: Chicken: ఆరునెలల తరువాత నిందితుణ్ని పట్టించిన చికెన్‌..!

వృషభం : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ఆర్థిక అభివృద్ధి, ధన లాభం చేకూరే అవకాశాలు కనపడుతున్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సంతోషాన్ని కలిగిస్తుంది. వినోద కార్యకలాపాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. 

Also Read: ఆమే నా సీరియస్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates

మిథునం : మిథునరాశి వారికి ఈ రోజు మాములుగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దలతో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే వివాదాలు, అపార్థాలు రావచ్చు. ఆదాయం అనుకున్నంతగా ఉండదు. ఆదాయం కంటే ఖర్చులు మించిపోయేలా ఉన్నాయి కాబట్టి ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. 

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆర్థిక లబ్ధి ఉంటుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. 

సింహం : సింహరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం , దృఢ నిశ్చయంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులు అన్ని పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలం. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభ సమయం. 

కన్య : కన్యారాశి వారికి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో మెరుగైన ఫలితాలు రావడం కష్టంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ మనోబలమే మీకు రక్ష. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. 

డాక్యుమెంట్లతో వ్యవహరించేటప్పుడు..

తుల : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పట్ల మీ నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్ర నష్టం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. రుణభారం పెరగవచ్చు. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. 

వృశ్చికం : వృశ్చిక రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సొంతం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభ సమయం. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగు పడతాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. సామజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

ధనుస్సు : ధనుస్సురాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి. ఆనందంగా ఉంటారు. ఉద్యోగులు- సహోద్యోగుల నుంచి సహకారం అందుకుంటారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. 

మకరం : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తీవ్రమైన అనారోగ్యం మీ ఆనందాన్ని హరిస్తుంది. కొన్ని సంఘటనల కారణంగా మీ మనసు గాయపడుతుంది. కీలక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునే శక్తి కొరవడుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. దైవారాధన మానవద్దు. 

కుంభం: కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మొండి పట్టుదల వీడి అందరినీ కలుపుకుని పోతే మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితుల వల్ల ఆరోగ్యం పాడవుతుంది, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు చోటు చేసుకోవచ్చు. సామాజికంగా మీ పరపతి దెబ్బతినే పనులు చెయ్యవద్దు. 

మీనం : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఇంటా బయట తీరికలేని పనులతో సతమతమవుతారు. ఇంటి మరమ్మతుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం, ప్రశంస లభిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరిగే సూచన ఉంది. స్థాన చలనం కూడా ఉండవచ్చు. 

Also Read: ఆపరేషన్ చేసిన స్టాప్‌నర్స్ కుట్లకు బదులు ఫెవిక్విక్‌ వాడితే.. చివరికి

Also Read: Jeeth adani:పెళ్లి వేళ దివ్యాంగులకు జీత్ అదానీ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ ఎన్నిలక్షలసాయం అందించారంటే!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు