RRB గ్రేడ్ 3 టెక్నీషియన్ ఆన్సర్ కీ .. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

RRB టెక్నీషియన్ గ్రేడ్ 3 రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు RRB వెబ్‌సైట్‌ ద్వారా ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. ప్రశ్నలు, ఆన్సర్ కీ సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే 11.01.2025 వరకు తెలియజేయవచ్చు.

New Update
Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్‌పై కీలక ప్రకటన!

RRB grade 3 answer key

RRB grade 3: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB టెక్నీషియన్ Grade 3 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేసింది.  2024 డిసెంబర్ 21 నుంచి 30 వరకు పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీని అధికారిక వెబ్ సైట్ లేదా ఇక్కడ ఇవ్వబడిన డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేటి నుంచి జనవరి 11 వరకు అధికారిక వెబ్ సైట్ లో ఆన్సర్ కీ యాక్టీవ్ గా ఉంటుంది.  

RRB టెక్నీషియన్ ఆన్స్ కీని  డౌన్లోడ్ విధానం :

  1. ముందుగా అధికారిక RRB వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  2. ఆ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 (CEN 02/2024) ఆన్స్ కీ డౌన్లోడ్ లింక్‌ను తెరవండి.
  3. లింక్ ఓపెన్ చేసిన తర్వాత  మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
  4. సమర్పించి ఆన్స్ కీని డౌన్లోడ్ చేసుకోండి.

Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్?

అభ్యంతరాల గడువు చివరి తేదీ 

ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఆన్సర్ కీ పరీక్ష ప్రశ్నలు, ఆన్సర్ కీ కి సంబంధించిన ఏవైనా అభ్యంతరాలు తెలియజేయడానికి జనవరి 6 నుంచి 11 ( ఉదయం  9 గంటల) వరకు చివరి తేదీ. గడువు తేదీ ముగిసిన తర్వాత ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబడవు. ప్రతి అభ్యంతరానికి రూ.50 ఆన్ లైన్ ఫీజు వర్తిస్తుంది.  RRB మీరు చేసిన అభ్యంతరం సరైనదని  ఆమోదిస్తే, మీ  ఫీజు తిరిగి ఇవ్వబడుతుంది. ఆన్సర్ కీ అభ్యంతరాలు తెలియజేయడానికి లింక్ 

Also Read: Sky Force: ఆన్ స్క్రీన్ లవ్ ఇంట్రెస్ట్ సారాకు కృతజ్ఞతలు.. వీర్ పహారియా కామెంట్స్

Advertisment
Advertisment