CISF Constable Recruitment: 'టెన్త్' చదివిన వారికి బంపరాఫర్.. భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లికేషన్ లింక్ ఇదే!

CISF భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్స్(డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్-ఫైర్ సర్వీస్) విభాగాలకు సంబంధించి మొత్తం 1124 ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వరకు అప్లై చేసుకోవాలి. పదోతరగతి అభ్యర్థులు అర్హులు.

New Update
CISF Constable Recruitment 2025 Announced, Notification Released for 1124 Vacancies

CISF Constable Recruitment 2025 Announced, Notification Released for 1124 Vacancies

CISF Constable Recruitment: కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానిస్టేబుల్(Driver), కానిస్టేబుల్స్(డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్- ఫైర్ సర్వీస్) విభాగాలకు సంబంధించి మొత్తం 1124 ఖాళీలను భర్తీ చేయనుంది. 

Also Read :  అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్

ఈ పోస్టులకు పదవతరగతి అర్హత ఉన్న పురుష అభ్యర్థులు అర్హులుగా తెలిపింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

మొత్తం ఖాళీల సంఖ్య: 1124 

పోస్టుల కేటాయింపు: 

జనరల్ (UR) 460 పోస్టులు
ఈడబ్ల్యూఎస్‌- 111 పోస్టులు
SC- 167 పోస్టులు, 
ST- 83 పోస్టులు, 
OBC- 303 పోస్టులు.

Also Read :  నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్‌!

కానిస్టేబుల్/ డ్రైవర్‌

జనరల్ (UR) - 344 పోస్టులు
ఈడబ్ల్యూఎస్‌- 84 పోస్టులు
SC- 126 పోస్టులు
ST- 63 పోస్టులు
OBC- 228 పోస్టులు ఉన్నాయి.

కానిస్టేబుల్/ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీస్) 

జనరల్ (UR) - 116 పోస్టులు
ఈడబ్ల్యూఎస్‌- 27 పోస్టులు
SC- 41 పోస్టులు
ST- 20 పోస్టులు
OBC- 75 పోస్టులు ఉన్నాయి.

Also Read :  తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..

అర్హత:

అభ్యర్థులు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. దీంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్(హెవీ మోటార్ వెహికల్/ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్/ లైట్ మోటార్ వెహికల్/ మోటార్ సైకిల్ విత్ గేర్) కలిగి ఉండాలి. అలాగే 3 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.

శారీరక ప్రమాణాలు: అభ్యర్థుల ఎత్తు 167 సెం.మీ, ఛాతీ కొలత 80-85 సెం.మీ. ఉండాలి.

వయోపరిమితి: 21 - 27 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

ఎంపిక విధానం: 

ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST)
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
ట్రేడ్‌ టెస్ట్‌
రాత పరీక్ష (OMR/ CBT)
డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్
రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.02.2025.
దరఖాస్తుకుల చివరి తేదీ: 04.03.2025.

                                        ONLINE APPLICATION

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు