అక్రమ వలసదారులకు అమెరికా బంపర్ ఆఫర్
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో స్వచ్ఛందంగా వెళ్లిపోయే వాళ్లకి అమెరికా స్టైఫండ్ ఆఫర్ ఇచ్చింది.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో స్వచ్ఛందంగా వెళ్లిపోయే వాళ్లకి అమెరికా స్టైఫండ్ ఆఫర్ ఇచ్చింది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. భారత్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఢాకాలోని భారత హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది.
1971 యుద్ధంలో ఇండియా ఆర్మీని, దౌత్య శక్తిని ధారపోసి పురుడు పోసిన దేశం బంగ్లాదేశ్. అప్పటి నుండి దశాబ్దాల పాటు భారత్ ఆ దేశాన్ని ఓ తమ్ముడిలా ఆదరిస్తూ.. రక్షణ, ఆర్థిక రంగాల్లో అండగా నిలిచింది. 54ఏళ్ల తర్వాత నేడు మారిన పరిస్థితుల కారణంగా ఆ బంధం మసకబారుతోంది.
అమెరికా రహస్య యుద్ధ విమానాలను కూడా నేలమట్టం చేయగలిగే లెటెస్ట్ టెక్నాలజీని రష్యా తయారు చేసింది. అధునాతన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-500 ప్రొమేథియస్ అధికారికంగా రంగంలోకి దిగింది. ఈ పవర్ ఫుల్ టెక్నాలజీ భారత్‌కు ఎగుమతి చేసే అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి.
ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ కూటమిలో 35956 అనే కృత్రిమ ఉపగ్రహం అదుపుతప్పి భూమి దిశగా కదులుతోంది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. రష్యా నుంచి మరో ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
అమెరికాలో తాత్కాలిక వీసాలపై పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్ దిగ్గజం గూగుల్ గుడ్‌న్యూస్ చెప్పింది. తమ సంస్థలో పనిచేసే హెచ్-1బీ (H-1B) ఉద్యోగులకు వచ్చే ఏడాది‘గ్రీన్‌కార్డ్ స్పాన్సర్షిప్ ప్రక్రియ’ను వేగవంతం చేయనుంది.
డ్రాగన్ దేశం తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. అంతేకాదు. ఆయుధ నియంత్రణ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ విషయమై ఆమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కనీసం ఆయుధాల నియంత్రణ చర్చలకు కూడా చైనా ఆసక్తి చూపడం లేదని అమెరికా ఆరోపిస్తోంది.
మెక్సికోలో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. నేవీకి చెందిన విమానం టెక్సాస్‌లోని గాల్వేస్టోన్ కాజ్వే వద్ద కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న బంగ్లాదేశ్‌ను దూరం చేయాలనే కుట్ర జరుగుతోంది. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ మరణంతో బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. 2026 ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి.