/rtv/media/media_files/2026/03/22/fotojet-4-2026-03-22-21-01-30.jpg)
.Iran's big warning to America
IRAN WARNING : మిడిల్ ఈస్ట్‌లో వార్ ముదురుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం రోజురోజుకు కీలక మలుపు తిరుగుతుంది. రెండు దేశాల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ సందర్భంగా అమెరికాకు ఇరాన్ మరో బిగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతకు ముందు ఇరాన్ ఎలక్ట్రిసిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ మీద దాడి చేస్తామని అమెరికా ఇచ్చిన వార్నింగ్ కు ధీటుగా ఇరాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తమపై దాడి చేస్తే గల్ఫ్ మొత్తం చీకటి చేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. గల్ఫ్ దేశాలలోని 80 శాతం విద్యుత్ కేంద్రాలు..సముద్ర తీరానికి 50 కి.మీ లోపే ఉన్నాయని ఇరాన్ హెచ్చరించింది. అన్ని విద్యుత్ కేంద్రాలను మా మిస్సైల్స్ పేల్చేయగలవు అంటూ వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్ వార్నింగ్‌తో మిడిల్ ఈస్ట్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పెరిగింది.చిన్న పొరపాటు జరిగినా సౌదీ, UAE,ఖతార్, కువైట్ దేశాల విద్యుత్ గ్రిడ్లు కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. విద్యుత్ ప్లాంట్స్ ఆగిపోతే సముద్రపు నీటిని...శుద్ధి చేసే ప్లాంట్స్ కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో తాగునీటి కటకట ఏర్పడే ఛాన్స్ ఉందని భయపడుతున్నాయి. ఇరాన్ అత్యాధునిక డ్రోన్స్, బాలిస్టిక్ మిస్సైల్స్ గల్ఫ్ దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను దాటిదాడులు చేస్తాయని సమాచారం ఉండటంతో ఆయా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.దుబాయ్‌లోని సోలార్ పార్కులను సైతం..ఇరాన్ తన టార్గెట్ లిస్టులో చేర్చింది. దీంతో భయపడిన గల్ఫ్‌దేశాలు ఇరాన్ నుంచి రక్షణ కల్పించాలని అమెరికాపై ఒత్తిడి తీసుకు వస్తున్నాయి.గల్ఫ్ దేశాల ఎలక్ట్రిసిటీ ఇన్‌ఫ్రాపై దాడి జరిగితే- ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Follow Us