Trump Iran War: మాట మార్చిన ట్రంప్.. ఇరాన్‌పై ఆగని బాంబుల వర్షం: మిడిల్ ఈస్ట్‌లో భీకర యుద్ధం!

ట్రంప్, ఇరాన్ ప్రతినిధులతో జరిగిన చర్చలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. చర్చలకు అవకాశం ఇచ్చేందుకు ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, ఇతర ఇంధన వనరులపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశించినట్లు ప్రకటించారు.

New Update
‘No deal with Iran except unconditional surrender, says Trump

‘No deal with Iran except unconditional surrender, says Trump

Trump Iran War: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఏమాత్రం చల్లారడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో అనూహ్యంగా తన పంథా మార్చుకున్నారు. ఇరాన్‌పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే, అమెరికా బలగాలు మళ్లీ బాంబుల వర్షం కురిపించడంతో ఉత్కంఠ నెలకొంది.

ఒకవైపు శాంతి ప్రకటన.. మరోవైపు దాడులు

సోమవారం ఉదయం తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందించిన ట్రంప్, ఇరాన్ ప్రతినిధులతో జరిగిన చర్చలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. చర్చలకు అవకాశం ఇచ్చేందుకు ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, ఇతర ఇంధన వనరులపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశించినట్లు ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తన దాడులను మరింత ఉధృతం చేయడం గమనార్హం.

Also Read: మతం మారితే రిజర్వేషన్లు రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

విరుచుకుపడుతున్న అమెరికా సేనలు
యుద్ధం మొదలై నాలుగో వారంలోకి ప్రవేశించిన తరుణంలో, అమెరికా మిలిటరీ 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో ఇరాన్‌ను దెబ్బతీస్తోంది. తాజాగా అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియోలో యుద్ధ విమానాలు ఇరాన్ మిలిటరీ స్థావరాలపై విరుచుకుపడుతున్న దృశ్యాలు కనిపించాయి. భారీ ఆయుధ నిల్వలు ఉన్న భవనాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఆయుధాలను తరలిస్తున్న ట్రక్కులు, రహస్య స్థావరాలను అమెరికా బాంబులతో నేలమట్టం చేసింది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం, ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు దిగడంతో అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

Also Read: 'ధురంధర్ 2' మేకింగ్ హిస్టరీ.. వీక్‌డేస్ లో కూడా రికార్డ్ కలెక్షన్స్!

తీవ్ర సంక్షోభంలో మిడిల్ ఈస్ట్
ట్రంప్ ఒకవైపు చర్చల గురించి చెబుతూనే, మరోవైపు మిలిటరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ మాత్రం అసలు చర్చలే జరగడం లేదని కొట్టిపారేసింది. ఈ దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అగ్రరాజ్యం దూకుడు చూస్తుంటే ఈ యుద్ధం త్వరలో ముగిసేలా కనిపించడం లేదు.

Advertisment
తాజా కథనాలు