Iran war : భీకర యుద్ధం.. ఇరాన్‌లో వెయ్యి మందికి పైగా మృతి..

గత కొద్ది రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం అత్యంత భయానక రూపం దాల్చింది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ పోరాటంలో ఇరాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది.

New Update
iran

గత కొద్ది రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం అత్యంత భయానక రూపం దాల్చింది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ పోరాటంలో ఇరాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ యుద్ధం కారణంగా ఇరాన్‌లో ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సామాన్య పౌరులు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

కీలక ప్రాంతాలపై బాంబుల వర్షం

యుద్ధం మొదలైనప్పటి నుండి ఇజ్రాయెల్, అమెరికా దళాలు ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా మిలిటరీ స్థావరాలు, వ్యూహాత్మక కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని వారు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలా నగరాల్లో జనం భయంతో ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఆసుపత్రులు గాయపడిన వారితో కిక్కిరిసిపోతున్నాయి, ప్రాథమిక సౌకర్యాలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.

మరోవైపు, ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ప్రతీకార దాడులకు దిగుతోంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ కూటమికి  సంబంధించి అత్యాధునిక ఆయుధాల ముందు ఇరాన్ తీవ్రంగా నష్టపోతున్నట్లు వార్తలు అందుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిని చూసి ఆందోళన చెందుతోంది. యుద్ధాన్ని తక్షణమే ఆపి శాంతిని నెలకొల్పాలని ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. 

కానీ, ఏ దేశం కూడా వెనక్కి తగ్గకపోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్నాయి. వేల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడుతున్న ఈ యుద్ధం ఇంకెంత మందిని బలి తీసుకుంటుందోనన్న భయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.

Advertisment
తాజా కథనాలు