/rtv/media/media_files/2025/12/13/fotojet-2025-12-13t112949198-2025-12-13-11-31-00.jpg)
Trump 50% tariffs on India
Trump Tariffs : భారత్‌పై ట్రంప్ విధించిన టారిఫ్స్ విషయంలో అమెరికా ప్రతినిధుల సభలో ఆయనకు చుక్కెదురైంది. భారతీయ వస్తువుల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలను రద్దు చేయాలని కోరుతూ.. అమెరికా ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు తాజాగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం విశేషం. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని.. అవి అమెరికన్ కార్మికులు, వినియోగదారులు, ఇండో-యూఎస్ సంబంధాలకు హాని కలిగిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
Also Read: కోల్‌కతాలో మెస్సీ ఫ్యాన్స్ ఫైర్.. గ్రౌండ్‌లోకి వాటర్ బాటిళ్లు విసురుతూ రచ్చ!
డెబోరా రాస్, మార్క్ వీసె, రాజా కృష్ణమూర్తి అనే ముగ్గురు యూఎస్ చట్టసభ ప్రతినిధులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు బ్రెజిల్‌పై విధించిన ఇలాంటి అత్యవసర సుంకాలను ఉపసంహరించుకోవాలని సెనేట్‌లో కూడా ఉభయపక్షాల మద్దతుతో ప్రయత్నం జరిగింది. తాజా తీర్మానం ప్రకారం ముఖ్యంగా ఆగస్టు 27, 2025 నుంచి అమలులోకి వచ్చిన అదనపు 25 శాతం "సెకండరీ" సుంకాలను రద్దు చేయాలని కోరింది. ఇప్పటికే ఉన్న పరస్పర సుంకాలను కలుపుకొని అనేక భారతీయ ఉత్పత్తులపై తాజా సుంకాలు 50 శాతానికి పెరిగిన సంగతి విదితమే.
Also Read: తెలంగాణలో దారుణం.. భార్యను చంపి ఎస్ఐకు వీడియో.. ఆ తర్వాత తాను కూడా..!
ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యురాలు రాస్ సభలో మాట్లాడుతూ నార్త్ కరోలినాకు, భారతదేశానికి మధ్య వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు ఎంతగానో ఉన్నాయని పేర్కొన్నారు. భారతీయ కంపెనీలు తమ రాష్ట్రంలో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని, తద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించ బడ్డాయని ఆమె గుర్తుచేశారు. అయితే ట్రంప్ విధించిన "చట్టవిరుద్ధమైన సుంకాలు" ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న నార్త్ టెక్సాస్ ప్రజలపై ఈ సుంకాలు పన్ను భారం పెంచుతున్నాయని వీసె అన్నారు. ఈ సుంకాలు ప్రతికూలమైనవని, సప్లై చైన్ విధానాన్ని దెబ్బతీస్తాయని, అమెరికన్ కార్మికులకు హాని చేస్తాయని కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: శీతాకాలంలో జర పదిలం.. పొంచి ఉన్న 10 గుండె జబ్బులివే!
అయితే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తోంది. దీనివల్ల మాస్కో ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి భారత్ పరోక్షంగా సహకరిస్తుందని ఆరోపిస్తూ.. ట్రంప్ కొన్ని నెలల కిందట సెకండరీ సుంకాలను విధించారు. ఈ ఆర్థికపరమైన ఉద్రిక్తతలు ఇరు దేశాల రక్షణ, సాంకేతికత, భౌగోళిక రాజకీయ సహకారానికి ఆటంకాలుగా మారాయి. తీర్మానం ద్వారా కాంగ్రెస్ డెమొక్రాట్‌లు ఏకపక్ష వాణిజ్య విధానాలను ప్రశ్నించడం, వాణిజ్యపరమైన అధికారాన్ని తిరిగి కాంగ్రెస్‌కు తీసుకురావాలని ప్రయత్నించడం వంటి విస్తృత లక్ష్యాలను కలిగి ఉన్నాయని నిపుణులు వెల్లడించారు.
Follow Us