/rtv/media/media_files/2026/03/22/fotojet-3-2026-03-22-20-05-29.jpg)
shoots down F-15 fighter jet
Trump's 48-hour deadline : హోర్ముజ్ జలసంధి విషయంలో జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల డెడ్‌లైన్‌ను ఇరాన్ ఏ మాత్రం లెక్కచేయలేదు. అంతేకాక హోర్ముజ్ ఐల్యాండ్‌లో శత్రువులకు సంబంధించిన ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని ప్రకటించి మరో సవాల్ విసిరింది. కాగా కూల్చివేతకు సంబంధించిన ఓ వీడియోను టెహ్రాన్ టైమ్స్ తన ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది. ఇరాన్ పై యుద్ధం కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా ఆ దేశం లైట్‌గా తీసుకుంటోంది. తాజాగా హోర్ముజ్ జలసంధి విషయంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. మూసి వేసిన హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా పునరుద్ధరించాలని ట్రంప్ కోరారు. లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అంతటితో ఆగక అతిపెద్ద విద్యుత్ కేంద్రం నుంచే ఈ దాడులు మొదలు పెడుతామని ట్రంప్ స్పష్టం చేశారు. దానికి సంబందించి ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ది ట్రూత్’లో శనివారం ఓ పోస్టు కూడా పెట్టారు. అయితే ట్రంప్ అల్టిమేటం ఇచ్చినా ఇరాన్ మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.
#BREAKING
— Tehran Times (@TehranTimes79) March 22, 2026
An enemy's F-15 fighter jet was shot down by Iranian air defense systems near Hormuz Island after being intercepted over the country’s southern coast. pic.twitter.com/jmrFuUQKbd
ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన వేళ ఇరాన్ వెనక్కు తగ్గక పోగా అమెరికాకు మరింత మండేలా హోర్ముజ్ ఐల్యాండ్‌లో శత్రువులకు సంబంధించిన ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని ప్రకటించడం గమనార్హం. దీనికి సంబందించిన వీడియోను టెహ్రాన్ టైమ్స్ తన ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది. 29 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో ఇరాన్ దళాలు హోర్ముజ్ ఐల్యాండ్‌పై ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను గుర్తించి పేల్చివేస్తున్నట్లు ఉన్న దృశ్యాలు సంచలనంగా మారాయి. అయితే, ఆ ఫైటర్ జెట్ అమెరికాకు చెందిందా? లేదా ఇజ్రాయెల్‌కు చెందిందా అన్నది మాత్రం ఇరాన్ ప్రకటించలేదు. ఆ రెండు దేశాలు కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.
కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ ఏ మాత్రం వెనుకకు తగ్గడంలేదు. కాగా ఇజ్రాయెల్ కు సంబంధించిన డిమోనా అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్ అణుబాంబులు ఉన్నట్లు అనుమానంతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. కాగా అక్కడ ఇరాన్ దాడి తర్వాత అణు రేడియోధార్మికత ఎక్కువైందని ఐఏఈఏ ప్రకటించింది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ రగిలిపోయింది. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఐడీఎఫ్ హెచ్చరించింది. అన్నట్లుగానే టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి.
Follow Us