/rtv/media/media_files/2026/03/29/123-2026-03-29-13-12-15.jpg)
Kurdish president residence attack
Kurdish president residence attack : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి. దీంతో మూడవ ప్రపంచ యుద్ధం వైపు అడగులు పడుతున్నాయన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం తప్పదని ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. తాజాగా ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతీయ అధ్యక్షుడు నెచిర్వాన్ బార్జానీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరగడం కలకలం రేపింది. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి గాయాలూ కాక పోయినప్పటికీ దాడులు సరికాదని ఆయన ఆరోపించారు. ఈ దాడిని కుర్దిస్థాన్ ప్రాంతీయ ప్రధానమంత్రి మస్రూర్ బర్జానీ తీవ్రంగా ఖండించారు. ఇది ఒక పిరికపంద చర్య అని ఘాటుగా విమర్శించారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు .
కాగా, తమ పౌరుల భద్రత, ప్రయోజనాలను కాపాడుకునేందుకు కుర్దిస్థాన్ ప్రాంతానికి అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని ప్రధాని మస్రూర్ బర్జానీ కోరారు. ఇలాంటి దాడులపై ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు, తమ ప్రాంతాన్ని రక్షించుకునేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. కాగా, ఈ దాడి ఎవరు చేశారన్న దానిపై క్లారిటీ లేనప్పటికీ మీరంటే మీరే కారణమని అమెరికా, ఇరాన్‌లు ఒకరిపై మరొకరు అరోపణలకు దిగారు.
తాజాగా అమెరికా మాట్లాడుతూ ఇరాన్‌కు మద్దతుగా ఉండే మిలీషియా గ్యాంగ్‌లు ఈ దాడికి పాల్పడి ఉంటాయని అనుమానం వ్యక్తం చేసింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ హత్యాయత్నం చేశాయని ఇరాన్ ఆరోపించింది. కుర్దిస్థాన్ అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడాన్ని ఐఆర్‌జీసీ తీవ్రంగా ఖండించింది. ఇది ఉగ్రవాద చర్య అని ఐఆర్‌జీసీ పేర్కొనడం గమనార్హం. ప్రాంతీయ భాగస్వాములను రక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హామీ ఇచ్చింది.
Follow Us