IRAN LEADERS DEATH : దేశ టాఫ్ లీడర్లు ఖతం..ప్రతికారంతో రగిలిపోతున్న ఇరాన్

ఇరాన్‌ పై యుద్ధం మొదలు పెట్టిన తొలిరోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీని మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌, అమెరికా దళాలు మరోసారి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాయి. ఇరాన్‌ ఇంటెలిజెన్స్ మినిస్టర్ అయిన ఇస్మాయిల్ ఖతీబ్ ను ఇజ్రాయెల్‌ దళాలు లేపేశాయి.

New Update
FotoJet (14)

Iran Massive Strike On Dubai

IRAN LEADERS DEATH : ఇరాన్‌ పై యుద్ధం మొదలు పెట్టిన తొలిరోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీని మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌, అమెరికా దళాలు మరోసారి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాయి. ఇరాన్‌ ఇంటెలిజెన్స్ మినిస్టర్ అయిన ఇస్మాయిల్ ఖతీబ్ ను ఇజ్రాయెల్‌ దళాలు లేపేశాయి. ఇరాన్‌ పై వరుసగా  మిస్సైల్స్, డ్రోన్లతో రెచ్చిపోతున్న ఇజ్రాయెల్   వరుసగా ఇరాన్ టాప్ లీడర్స్‌ను మట్టుపెడుతుంది.నిన్న ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ షంఖానీతో పాటు.. IRGC చీఫ్ లారీజాని మృతి చెందిన విషయం తెలిసిందే. ఇరాన్‌ సుప్రీం అలీ ఖమేనీ తర్వాత ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో..ఇరాన్ రక్షణ, నిఘా వ్యవస్థకు చెందిన 10 మంది ముఖ్య నేతలు మృతి చెందారు. వరుసగా నాయకుల మరణాలతో ఇరాన్‌లో సందిగ్ధత ఏర్పడింది. నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఇరాన్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

వరుసగా నేతలను కోల్పోతున్న ఇరాన్‌ ప్రతీకారంతో రగిలిపోతుంది. దీంతో తన పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు వార్నింగ్‌ ఇచ్చింది. సౌదీ, ఖతార్, UAEకి హెచ్చరికలు జారీ చేసింది. సౌదీలోని సమ్రెఫ్‌ రిఫైనరీతో పాటు జుబైల్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌, దుబాయిలోని అల్ హసన్ గ్యాస్‌ ఫీల్డ్, ఖతార్‌లోని మెసాయీద్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై దాడులు చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. వెంటనే ఆయా ప్రాంతాలు ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేసింది.వరుసగా టాప్‌ లీడర్స్‌ను కోల్పోతున్న ఇరాన్  ప్రతీకారంతో రగిలిపోతుంది.  మా నాయకుల మరణానికి ప్రతీకారం తప్పదంటూ హెచ్చరించింది.  మేం రక్తదాహంతో ఉన్నాం అంటూ ఇరాన్‌ హెచ్చరించింది.

ఇదిలా ఉండగా- ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ స్టేషన్‌పై దాడి చేసింది.ఈ దాడిలో దక్షణ పార్స్‌లోని గ్యాస్ స్టేషన్‌ ధ్వంసమైంది.ఈ దాడితో ఇరాన్‌కు ఆర్థికంగా మరిన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ దాడి వల్ల  ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్‌ ధరలు పెరగనున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇరాన్‌లోని పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు