ప్రస్తుత సాంకేతిక యుగంలో సమాచారమే ఆయుధం. కొన్ని ప్రైవేట్ సంస్థలు, ఏజెన్సీలు..చాలా మంది డేటాను సేకరించి,వినియోగించుకుంటున్నాయి. తాజాగా గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ నుంచి అమెరికా ప్రభుత్వం డేటాను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టెలిగ్రామ్ తన పారదర్శక నివేదికలో వెల్లడించింది. గతేడాది 900 రిక్వెస్టులు పెట్టి..2,253 మంది యూజర్ల డేటాను అమెరికా ప్రభుత్వం సేకరించిందని అందులో వివరించింది. Also Read: California: అమెరికాకు సాయం చేసేందుకు మేము రెడీ: ట్రూడో! తొలి 9 నెలల్లో 14 రిక్వెస్టులు రావడంతో 108 మంది డేటాను ప్రభుత్వానికి అందజేసినట్లు టెలిగ్రామ్ పేర్కొంది. గతేడాది టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్టయిన తర్వాత అమెరికా ప్రభుత్వం చేసిన దరఖాస్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. 2024 ఆగస్టులో పావెల్ దురోవ్ ఫ్రాన్స్ లో అరెస్టయిన సంగతి తెలిసిందే. టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం, మాదకద్రవ్యాల అక్రమరవాణా, చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలతో పారిస్ ఎయిర్‌పోర్టులో ఫ్రాన్స్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. Also Read: L And T: భార్యలను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు..ఆదివారాలు పని చేయండి! ప్రభుత్వంతో పంచుకునే వీలు.. దురోవ్ అరెస్ట్ తర్వాత ప్రైవసీ పాలసీలో టెలిగ్రామ్ మార్పులు చేసింది. ప్రభుత్వం నుంచి అధికారికంగా రిక్వెస్ట్ వస్తే..యూజర్ల ఐపీ, ఫోన్ నెంబర్ లాంటి నిర్దిష్ఠ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తోంది.అప్పటి వరకు టెలిగ్రామ్ పాలసీ ప్రకారం..యూజర్ల వివరాలను ప్రభుత్వంతో పంచుకునే వీలు లేదు.గతేడాది చివరి త్రైమాసికంలో ఈ పాలసీలో మార్పులు చేయడంతో పలువురు వ్యక్తుల సమాచారం కావాలంటూ అమెరికా ఎన్‌ఫోర్స్ మెంట్ నుంచి టెలిగ్రామ్ కు దరఖాస్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. టెలిగ్రామ్ తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీలో మార్పుతో యూజర్లలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమ వ్యక్తిగత సమాచారం పై ప్రభుత్వం కన్నేసి ఉంచుతోందా?సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు ఉంచాలా? వద్దా? అనే విషయం పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భద్రతపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గోప్యతకు ప్రాధాన్యత ఇచ్చే ఫ్లాట్‌ఫామ్‌లలోనూ వినియోగదారుల డేటా సేకరణ జరుగుతోందనడానికి ఇదే నిదర్శనం.ప్రభుత్వ డిమాండ్లకు కట్టుబడి ప్రైవేట్ సంస్థలు తమ యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లకుండా డేటాకు ఎంత వరకు రక్షణ ఇవ్వగలవన్న దాని పై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఈ తరహా చర్యలను డిజిటల్ గోప్యతకు సవాల్ గా అభివర్ణిస్తున్నారు. Also Read: Lay Offs: కొత్త ఏడాదిలో మొదలైన కోతలు..మైక్రోసాఫ్ట్ లో హూస్టింగ్ లు! Also Read: Us:లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు..అగ్నికి ఆహుతైన బైడెన్ కుమారుడి ఇల్లు