Syria: సైద్నాయలో సిరియా ప్రజల వెతుకులాట..దేని కోసం? సిరియాలో కొన్నేళ్ళ అణిచివేతకు ముగింపు పలికారు. నిరంకుశ పాలకుడు అయిన అసద్‌ను దేశం నుంచి తరిమికొట్టారు. ఇప్పుడు అక్కడ ప్రజలు సైద్నాయలో తమ ఆత్మీయుల కోసం వెతుక్కుంటున్నారు. అసలేంటీ సైద్నాయ? ఇక్కడ ఏం చేసేవారు వివరాలు కింది ఆర్టికల్‌లో... By Manogna alamuru 10 Dec 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బషర్ అల్ అసద్...సిరియా మాజీ అధ్యక్షడు. ఇతనో కరడుగట్టిన నియంత. 50 ఏళ్ళుగా ఇతని కుటుంబమే సిరియాను పాలిస్తూ వచ్చింది. అందరి కంటే అసద్ మరింత క్రూరుడని చెబుతారు. అందుకే ప్రజలు తిరగబడ్డారని తెలుస్తోంది. సిరియాలో తిరుగుబాటు ఇంత పెద్ద ఎత్తున జరిగి ప్రభుత్వం కూలిపోవడం ఇదే మొదటిసారి. కానీ ఇలాంటి తిరుగుబాటులు ఇంతకు ముందు కూడా చాలనే జరిగాయి. అయితే వాటన్నింటనీ అసద్ పాలనలో అధికారులు చిన్నగా ఉన్నప్పుడే అణిచివేశారు. తిరుగుబాటు దారులను సైద్నాయలో ఉంచి చిత్రహింసలు పెట్టేవారుట. సైద్నాయ ఒక జైలు. బషర్ అల్-అసద్ పాలన సమయంలో కరుడుగట్టిన ప్రభుత్వ వ్యతిరేకులను రాజధాని డమాస్కస్ శివార్లలోని సైద్నాయ అనే ఓ ప్రత్యేకమైన జైలులో బంధించేవారు. దీనినే సిరియా వధశాల అంటారు. అక్కడ ఖైదీలను చిత్రహింసలకు గురిచేసేవారు. కరెంట్ షాక్‌లు, అత్యాచారాలు, హత్యలు వంటివి ఆ జైల్లో జరిగినట్లు దేశవ్యాప్తంగా చెప్పుకుంటుంటారు. అదొక నరకం... 2011లో సిరియా ప్రభుత్వంపై ఉద్యమం మొదలైంది. అప్పుడే పుట్టుకొచ్చింది ఈ సైద్నాయ. తమను ఎవరు వ్యతిరేకించినా అసద్ ప్రభుత్వం వారిని సైద్నాయకు తరలించేది. 2017లో అమ్నెస్టి ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం...ఇందులో 10వేల నుంచి 20 వేల మంది ఆ జైల్లో ఉన్నట్లు అంచనా. వారందరినీ చిత్రహింసలకు గురి చేసి చంపడానికే ఇక్కడకు తీసుకొచ్చారు. ఇకకడ తరుచుగా వేలమందిని సామూహికంగా హత్య చేసేవారుట. ఇక ఖైదీలను చిత్రహింసలకు గురిచేయడం ఆ జైల్లో నిత్యకృత్యం. గాయాలు, వ్యాధులు, ఆకలితో రాత్రికి రాత్రే ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలను తీసుకెళ్లడానికి గార్డులు రౌండ్స్‌కు వచ్చేవారు. ఈ నరకాన్ని ప్రత్యక్షంగా చూసిన కొందరు మానసిక వ్యాకులతకు లోనై ఆహారం మానేసి ప్రాణాలు వదిలేసేవారు. సోదరులను కోల్పోని మహిళ సిరియాలో లేదంటే అతిశయోక్తి కాదని సిరియాలో ఎవరిని అడిగినా చెబుతారు. 2011 నాటి నుంచి సిరియాలో ఇప్పటివరకూ 1, 50, 000 మంది కనిపించకుండా పోయారు. వీరిలో చాలామంది సైద్నాలోనే తమ చివరి రోజులు గడిపారని తెలుస్తోంది. 2021లో యూకే కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అంచనాల ప్రకారం ఈ జైళ్లలో కనీసం లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ జలు వై ఆకారంలో ఉంటుంది. భవనాలకు ఎర్రరంగు వేసి ఉంటుంది. సైద్నాయకు తీసుకువచ్చే ముందు డమాస్కస్ శివార్లలోని అల్-ఖ్వబౌన్ మిలిటరీ ఫీల్డ్ కోర్టులో శిక్షలు విధించేవారు. ఈ ప్రక్రియ ఒకటి నుంచి మూడు నిమిషాల్లో ముగిసిపోయేది. అదేరోజు వారిని జైలుకు తరలించి ఉరితీసేవారు. దానిని వారు పార్టీగా అభివర్ణించేవారని చెబుతున్నారు. ఉరితీసే ముందు రెండు మూడు గంటలు చిత్రహింసలు పెట్టేవారు. అయితే అసద్ ప్రభుత్వం 2015 నుంచి ఈ ప్రక్రియ బయటకు రాకుండా చర్యలు చేపట్టింది. కొందరు నమ్మకమైన అధికారులకు మాత్రమే ఈ వివరాలు తెలిపేవారు. ఇక తమ వద్ద నుంచి అర్ధరాత్రి పూట తీసుకెళ్లిన ఖైదీలు ఏమయ్యేవారో అన్న ఆ సమాచారం అక్కడి గార్డులకు కూడా తెలిసేది కాదు. ఈ మరణశిక్షలు అమలు చేయాలని అసద్ తరఫున గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ సిరియా, రక్షణ మంత్రి లేదా ఆర్మీచీఫ్ నుంచి ఆదేశాలు వచ్చేవి. ప్రస్తుతం రెబల్స్ డెమాస్కస్‌ను ఆక్రమించాక ప్రజలు సైద్నాయ దగ్గరకు పరుగులు తీస్తున్నారు. ఏళ్ళ తరబడి కనిపించకుండా పోయిన తమవారి జాడ మైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నారు. అయితే అక్కడ ఎవరూ కనిపించడం లేదు. దీంతో రహస్య మార్గాలు మైనా ఉన్నాయా అని జన వెతుకులాడుతున్నారు. అయితే తిరుగుబాటుకు ఒకరోజు ముందే సైద్నాయలో ఉన్న ఖైదీలను తిరుగుబాటుదారులు విడిచిపెట్టారని తెలుస్తోంది. Also Read: Delhi: వైరల్ అయిన కేజ్రీవాల్ అద్దాల మేడ వీడియో..బీజేపీపై ఆప్ మండిపాటు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి