/rtv/media/media_files/2025/03/15/lzsfSfu1vngF1a4XvIFY.jpg)
USA Weather
మంచు తుఫాన్లు అయిపోయాయి...ఇప్పుడు అమెరికాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. దుమ్ముధూళితో కూడిన బలమైన గాలులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో 100కుపైగా కార్చిచ్చులు చెలరేగాయి. దీనివలన పదహారు మందికి పైగా మృతి చెందారు. మిసోరీలోని బేకర్స్ ఫీల్డ్ ప్రాంతంలో టోర్నడో ప్రభావానికి ఇద్దరు చనిపోయారు. టెక్సాస్ పాన్ హ్యాండిల్ లోని మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో పాటూ చాలా బిల్డింగులు దెబ్బతిన్నాయి. అలబామా, కెంటకీ, మిసిసిపీ, టెనసీ, ఇల్లినోయీ, ఇండియానా, టెక్సాస్, టెన్నెసీ రాష్ట్రాలకూ ఇంకా టోర్నడోల ముప్పు పొంచి ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
భయపెడుతున్న టోర్నడోలు..
కెనడా సరిహద్దు నుంచి టెక్సాస్ వరకు తుఫాన్లు, టోర్నడోలు భయపెడుతున్నాయి. 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఓక్లహోమా, మిస్సోరీ, న్యూ మెక్సికో, టెక్సాక్, కాన్సన్ లలో గాలుల వల్ల కారిచిచ్చులు చెలరేగుతున్నాయి. దీంతో ప్రజలను కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు.. మిన్నెసొటా, సౌత్ డకోటాలోని కొన్ని ప్రాంతాలకు మంచు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. అయితే ఇదేమీ అసాధారణ పరిస్థితులు కాదని..మార్చి నెలలో అమెరికాలో ఈ వాతావరణం సహజమేనని చెబుతున్నారు. కానీ ఈసారి ఎప్పటికన్నా కొంచెం అధికంగా ఉందని అంటున్నారు.
Also Read: DMK: అప్పటికీ పవన్ ఇంకా పుట్టలేదేమో..డీఎంకే