వీధిలో ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు రూ.3.5 లక్షల జరిమానా

లండన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బహిరంగా ప్రదేశాల్లో పాన్ ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు 2800 పౌండ్లు (రూ.3.48 లక్షలు) ఫైన్ విధించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Spitting paan on London street costs two Indian-origin men £2,800 in fines

Spitting paan on London street costs two Indian-origin men £2,800 in fines

లండన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బహిరంగా ప్రదేశాల్లో పాన్ ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు దాదాపు 2800 పౌండ్లు (రూ.3.48 లక్షలు) ఫైన్ విధించారు. మొదటగా 100 పౌండ్ల పైన్ విధించగా దాన్ని చెల్లించకపోవడం, విచారణ కోసం కోర్టుకు రాకపోవడంతో బ్రెంట్ సిటీ అధికారులు ఈ భారీ జరిమానా విధించారు. లండన్‌ శివార్లలో ఉండే ఈ బ్రెంట్ సిటీ అనే ప్రాంతం అత్యంత చైతన్యవంతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందింది.  

ఆ ప్రాంతంలో పాన్ ఉమ్మడం పెరగిపోవడంతో అక్కడి రోడ్లు చెత్తగా తయారవుతున్నాయి. ఈ మరకలను శుభ్రం చేసేందుకు నగర కౌన్సిల్‌కు ఏడాదికి 30 వేల పౌండ్ల ఖర్చవుతోంది. దీని ప్రభావం ప్రజలపై పన్ను భారానికి దారి తీస్తోంది. ఈ క్రమంలోనే నగర కౌన్సిల్ దీనిక వ్యతిరేకంగా జీరో టాలరెన్స్‌ ప్రచారాన్ని మొదలుపెట్టింది. 

Also Read: వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ విడుదల.. అత్యంత సంతోషకరమైన దేశం అదే.. భారత్ ఏ స్థానంలో ఉందంటే ?

గతేడాది జూన్‌లో స్థానిక మెట్రో స్టేషన్ దగ్గర కింగ్స్‌బర్గీ రోడ్డుపై ఎజ్జ్‌వేర్ పట్టణానికి చెందిన అక్షిత్ భద్రే అనే వ్యక్తి పాన్ ఉమ్మివేశాడు. దీంతో నార్త్ వెస్ట్ మెజిస్ట్రేట్స్ కోర్టు అతడిని 100 పౌండ్ల ఫైన్ విధించింది. కానీ అతడు విచారణకు హాజరు కాలేదు. ఫైన్ కూడా చెల్లించకపోవడంతో అది పెరిగిపోయింది. మరోవైపు రూయిస్లిప్‌ శివారు ప్రాంత నివాసి అయిన హితేష్‌ పటేల్‌ వెంబ్లీ హిల్‌ రోడ్డుపై పాన్‌ ఉమ్మివేశాడు. ఇతనికి కూడా ఫైన్ పడింది. మొదటి కేసు తరహాలోనే ఇతడు కూడా కోర్టుకు రాలేదు. ఫైన్ చెల్లించలేదు.దీంతో ఆ జరిమానాను ఇద్దరికీ పది రెట్లు పెంచారు.

లండన్‌లో బ్రెంట్‌, హోరో తదితరల ప్రాంతాల్లో పాన్ ఉమ్మివేయడంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కౌన్సిల్ ఈ చర్యలకు దిగింది. మా వీధులను పాడు చేసే వాళ్లను మేము సహించమని.. తాము విధించే ప్రతి జరిమానా ఓ స్పష్టమైన సందేశమని పేర్కొంది. వీధులను పాడు చేసేవారు కచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. 

Also Read: అమెరికాకు బిగ్ షాక్.. విదేశాల నుంచి దిగుమతులు.. స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు

Advertisment
తాజా కథనాలు