Brazil Plane Crash: ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలిన విమానం..10 మంది మృతి!

బ్రెజిల్‌ లో ఓ చిన్న విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో సుమారు 10 మంది ప్రయాణికులు మృతిచెందారు.మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటక పట్టణమైన గ్రామడోలో ఈ ఘటన జరిగింది.

New Update
accident

Brazil Plane Crash

Flight Accident: బ్రెజిల్‌ లో పెను విషాదం చోటు చేసుకుంది.ఓ చిన్న విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో సుమారు 10 మంది ప్రయాణికులు మృతిచెందారు.మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటక పట్టణమైన గ్రామడోలో ఈ ఘటన జరిగింది. అధికారుల సమాచారం ప్రకారం..విమానం ముందు ఓ భవనాన్ని ఢీకొట్టి అనంతరం ఇతర ఇళ్లను ఢీకొడుతూ చివరగా ఫర్నీచర్‌ దుకాణంలోకి దూసుకెళ్లింది.

Also Read: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని!

దీంతో అందులో ఉన్న ప్రయాణికులందరూ చనిపోయారు.గ్రామడో పర్వత ప్రాంతంలోని పట్టణం. ఇదీ పర్యాటకులకు ప్రసిద్ధి. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభమవుతాయనగా ఈ ఘటన జరగడంతో అక్కడి వాసులు షాక్‌ కు గురయ్యారు. 

Also Read: ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు

ఆస్పత్రిని ఢీకొని కుప్పకూలిన హెలికాప్టర్

తుర్కియేలో ఘోర ప్రమాదం జరిగింది. డాక్టర్లతో కలిసి బయలుదేరిన ఓ  అంబులెన్స్‌ హెలికాప్టర్‌ ఏకంగా ఆస్పత్రి భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఇద్దరు పైలట్లు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. తుర్కియేలోని అంతల్యా ప్రావిన్సులోని ఉన్న ఓ రోగిని ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు ముగ్లా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్‌ వైద్యుల బృందం హెలికాప్టర్‌లో బయలుదేరింది.  

Also Read: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్

అందులో ఇద్దరు పైలట్లు, ఒక వైద్యుడు మరో వైద్య సహాయకుడు ఉన్నారు. అయితే హెలికాప్టర్‌ టేకాఫ్‌ అవుతుండగా అదుపుతప్పింది. ఈ క్రమంలోనే ఆస్పత్రి నాలుగో అంతస్తును ఢీకొట్టి కుప్పకూలింది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. 

Also Read: ఎట్టకేలకు కలుసుకున్న ఉద్ధవ్‌ ఠాక్రే, రాజ్‌ ఠాక్రే.. వీడియో వైరల్

హెలికాప్టర్‌ బయలుదేరుతున్న సమయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రి భవనం బయట హెలికాప్టర్‌ శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి.      

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు