Rupee Value: యుద్ధ ప్రభావం.. రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి విలువ.. డాలర్‌కు రూ.93.69

మిడిల్‌ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధ ప్రభావం భారత కరెన్సీపై పడింది. రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద అమెరికా డాలర్‌ ముందు నిలవలేకపోతోంది. శుక్రవారం మరో 64 పైసలు పడిపోయి తొలిసారిగా రూ.93 మార్కును దాటింది.

New Update
Rupee sinks past 93 per dollar to record low as Iran war risks deepen

Rupee sinks past 93 per dollar to record low as Iran war risks deepen

మిడిల్‌ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధ ప్రభావం భారత కరెన్సీపై పడింది. రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద అమెరికా డాలర్‌ ముందు నిలవలేకపోతోంది. శుక్రవారం మరో 64 పైసలు పడిపోయి తొలిసారిగా రూ.93 మార్కును దాటింది. మార్చి 21 నాటికి  రూ.93.69 వద్దకు చేరింది. అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో చమురు ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో రూపాయి విలువ రోజురోజుకు దిగజారుతోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రూపాయి విలువ మరింత పతనమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది

ప్రస్తుతం మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ముడి చమురు కొనుగోలుకు భారత్ భారీగా డాలర్లను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రూపాయి విలువను తగ్గించేస్తోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. మార్చి నెలలోనే ఇప్పటి దాకా సుమారు $8.5 బిలియన్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇలా పెద్ద ఎత్తున డాలర్లు దేశం బయటకు వెళ్లడంతో రూపాయి మరింత ఒత్తిడి పడింది. ముఖ్యంగా యుద్ధ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఇతర కరెన్సీల కన్నా అమెరికా డాలర్‌నే సురక్షితంగా భావిస్తారు. 

ఈ అంశాలన్నీ ప్రస్తుతం రూపాయి విలువ పడిపోవడానికి దారి తీస్తున్నాయని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పడిపోతున్న రూపాయి విలువ.. దేశీయ దిగుమతుల ధరను మరింత పెంచుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇంధన అవసరాల కోసం దాదాపు 90 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల వల్ల రూపాయి విలువ రోజురోజుకు పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

సామాన్యులపై ప్రభావం 

ఇలా జరిగితే ద్రవ్యోల్బణం మరింత పెరిగుతోందని చెబుతున్నారు. జీడీపీ వృద్ధిరేటు, ఉద్యోగావకాశాలు, కోనుగోలు శక్తి, రుణ లభ్యం లాంటివాటిపై  తీవ్ర ప్రభావం పడుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్బీఐ జోక్యం అవసరమని మరికొందరు వాదిస్తున్నారు. రూపాయి మారకం విలువ ఆర్బీఐ పెట్టుకున్న 92.50 పరిమితిని దాటిపోయినట్లు చెబుతున్నారు. మార్కెట్‌లో డాలర్ల సరఫరా పెంచినట్లయితే కొంత ప్రయోజనం ఉండొచ్చని అంటున్నారు.  

రూపాయి విలువ తగ్గడంతో వల్ల భారత్ దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులపై ఆర్థిక భారం పెరగనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్లోకి డాలర్లను విడుదల చేస్తూ రూపాయిని ఆదుకునే ప్రయత్నం చేసినా.. యుద్ధం ఆగితే తప్ప పరిస్థితులు అదుపులోకి వచ్చేలా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తగ్గిపోయిన విదేశీ మారక నిల్వలు 

విదేశీ మారకం నిల్వలు మరింత తగ్గిపోయాయి. మార్చి 13తో ముగిసిన వారాంతానికి ఫారెక్స్ రిజర్వులు 7.052 బిలియన్ డాలర్లకు తగ్గి 709.759 బిలియన్ డాలర్లకు చేరినట్లు RBI వెల్లడించింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.66.50 లక్షల కోట్లు. అంతకుముందు వారంలో ఫారెక్స్ రిజర్వులు 11.683 బిలియన్ డాలర్లు త్గగి 716.81 బిలియన్‌ డాలర్ల వద్ద ఉన్నాయి. ఫిబ్రవరి 27 నాటికి ముగిసిన వారంలో 5 బిలియన్ డాలర్లు పెరిగి 728.494 బిలియన్ డాలర్లకు చేరాయి. కానీ ఆ తర్వాత పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభం కావడంతో ఫారెక్స్ రిజర్వులు పడిపోతూ వస్తున్నాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ రోజురోజుకు పడిపోవడం వల్లే ఫారెక్స్ రిజర్వులు కూడా తగ్గిపోతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు