Pakistan : పాకిస్థాన్ చెత్త రికార్డు..  ప్రపంచంలోనే నెంబర్ వన్!

పాకిస్థాన్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య పూరితమైన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ తరువాతి స్థానాల్లో బంగ్లాదేశ్, తజికిస్థాన్ ఉండగా భారత్ 6వ స్థానంలో నిలిచింది.

New Update
pakistan

పాకిస్థాన్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య పూరితమైన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ తరువాతి స్థానాల్లో బంగ్లాదేశ్, తజికిస్థాన్ ఉండగా.. భారత్ 6వ స్థానంలో నిలిచింది. స్విస్ సంస్థ IQAir వెల్లడించిన ఈ రిపోర్ట్ లో 143 దేశాలలోని 9 వేల 446 నగరాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించారు. ఇందులో  అత్యంత కాలుష్య దేశాల లిస్టులో పాకిస్థాన్, బంగ్లాదేశ్, తజికిస్థాన్, చాద్,కాంగో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచంలోని అత్యంత కాలుష్య పూరితమైన 25 నగరాలన్నీ కేవలం భారత్, పాకిస్థాన్, చైనాలోనే ఉండటం గమనార్హం. ఇక దక్షిణాఫ్రికాలోని న్యూవుడ్ట్‌విల్లే ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా నిలిచింది. ఇక్కడ గాలిలో కాలుష్య కారకాలు కేవలం 1.0 g/m³ మాత్రమే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ అత్యంత కాలుష్య నగరంగా మొదటి స్థానంలో నిలవగా, మేఘాలయలోని బైర్నిహాట్ మూడవ స్థానంలో, ఢిల్లీ నాలుగవ స్థానంలో ఉన్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను కేవలం 13 దేశాలు మాత్రమే పాటించగలుగుతున్నాయి. ఐస్‌లాండ్, ఆస్ట్రేలియా, ఎస్టోనియా వంటి కొన్ని దేశాలు మాత్రమే స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్నాయి. మిగిలిన 91 శాతం దేశాలలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటిపోయింది.  వాయు కాలుష్యం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారని నివేదిక హెచ్చరించింది. ఎదుగుతున్న వయసులో ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల ఆ ప్రభావం వారి జీవితాంతం ఉంటుందని, ఇది మార్చలేని నష్టమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చైనా 20వ స్థానంలో

అత్యంత కాలుష్య దేశాల జాబితాలో చైనా 20వ స్థానంలో ఉండగా.. అభివృద్ధి చెందిన దేశాలైన బ్రిటన్ (110వ స్థానం), అమెరికా (120వ స్థానం) మెరుగైన స్థితిలో ఉన్నాయి. 2025లో కార్చిచ్చుల వల్ల గతంలో తక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో కూడా కాలుష్య స్థాయిలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు