/rtv/media/media_files/2026/03/22/open-strait-of-hormuz-within-48-hours-trump-warns-iran-2026-03-22-08-05-29.jpg)
Open Strait Of Hormuz Within 48 Hours Trump Warns iran
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. హర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల చాలా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. ఈ జలసంధిని తెరిపించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తమ యుద్ధ నౌకను కూడా అక్కడికి తరలిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన హెచ్చరిక దేశారు. హర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. ట్రూత్ సోషల్‌లో దీనికి సంబంధించి పోస్టులు పెట్టారు.
Also Read: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షాక్.. అసైన్డ్ భూమిలో ఫామ్‌హౌస్?
48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని తెరవాలి. ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదు. దీన్ని పూర్తిగా తెరవకుంటే ఇరాన్‌లో పలు విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేసి పూర్తిగా ధ్వంసం చేస్తాం. అన్నిటికన్నా ముందు అతిపెద్ద విద్యుత్ కేంద్రంలో ఈ దాడులు ప్రారంభిస్తామని'' ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: అమెరికాపై విరుచుకుపడుతున్న ఇరాన్..ఆ దేశ ఆయుధ సంపత్తి ఇదే..
ఇదిలాఉండగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేయడం వల్ల పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. అందుకే ఆ జలసంధిని తెరిచేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. 48 గంటల్లోగా తెరవాలంటూ హెచ్చరించారు.
Follow Us