Netanyahu Trump Iran Attack: యుద్ధం వెనుక నెతన్యాహు ఫోన్ కాల్ రహస్యాలు.. ఇరాన్‌పై దాడికి ట్రంప్‌ను ఒప్పించిందెవరు?

యుద్ధం ప్రారంభానికి 48 గంటల ముందు నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేశారు. ఖమేనీ తన ముఖ్య అనుచరులతో టెహ్రాన్‌లో సీక్రెట్‌గా సమావేశం కాబోతున్నారనే పక్కా నిఘా సమాచారాన్ని నెతన్యాహు పంచుకున్నారు. ఇరాన్‌పై దాడికి నెతన్యాహు ట్రంప్‌ను ఒప్పించినట్లు సమాచారం.

New Update
donald trump

Netanyahu Trump Iran Attack

Netanyahu Trump Iran Attack: ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ జాయింట్‌గా బాంబుల వర్షం కురిపించాయి. ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంతానికి దారితీసిన ట్రంప్ నిర్ణయం వెనుక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్లాన్ ఉందనే వార్తలు వస్తున్నాయి. నెతన్యాహు ట్రంప్‌ను రెచ్చగొట్టి యుద్ధానికి దింపాడని తెలుస్తోంది. దీనికి కారణం ఓ కాల్ రికార్డ్ వైరల్ అవుతోంది.

Also Read: 'ధురంధర్ 2' మేకింగ్ హిస్టరీ.. వీక్‌డేస్ లో కూడా రికార్డ్ కలెక్షన్స్!

ఆ 48 గంటల్లో ఏం జరిగింది?

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. యుద్ధం ప్రారంభానికి కేవలం 48 గంటల ముందు నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేశారు. ఖమేనీ తన ముఖ్య అనుచరులతో టెహ్రాన్‌లో సీక్రెట్‌గా సమావేశం కాబోతున్నారనే పక్కా నిఘా సమాచారాన్ని నెతన్యాహు పంచుకున్నారు. "ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని అంతం చేయడానికి (శిరచ్ఛేద దాడి) ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు. ఈ నిర్ణయంతో మీరు చరిత్ర సృష్టించగలరు" అని నెతన్యాహు ట్రంప్‌ను ఒప్పించినట్లు సమాచారం.

Also Read: మతం మారితే రిజర్వేషన్లు రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ట్రంప్ అప్పటికే ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధంగా ఉన్నప్పటికీ, సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఖమేనీ సమావేశం శనివారం రాత్రి నుంచి శనివారం ఉదయానికి మారిందన్న కొత్త సమాచారం అందడంతో, నెతన్యాహు ఒత్తిడి పెంచారు. 1979 నుండి ఇరాన్‌ను పాలిస్తున్న మత వ్యవస్థను కూలదోయడానికి ఇదే సరైన తరుణమని, అమెరికా దాడి చేస్తే ఇరాన్ ప్రజలు కూడా వీధుల్లోకి వచ్చి తిరుగుబాటు చేస్తారని నెతన్యాహు వాదించారు. ఇలా ఆయన ట్రంప్‌ను దాడులకు ఉసిగొలిపారని సమాచారం.

Also Read: మాట మార్చిన ట్రంప్.. ఇరాన్‌పై ఆగని బాంబుల వర్షం: మిడిల్ ఈస్ట్‌లో భీకర యుద్ధం!

ఈ పరిణామాల తర్వాతే ఫిబ్రవరి 27న ట్రంప్ దాడులకు ఆదేశాలివ్వగా, ఫిబ్రవరి 28న ఖమేనీ హతమయ్యారు. అయితే, ఇజ్రాయెల్ తనను యుద్ధంలోకి లాగిందన్న వార్తలను ట్రంప్ తోసిపుచ్చారు. నెతన్యాహు సైతం వీటిని "ఫేక్ న్యూస్" అని కొట్టిపారేశారు. "అధ్యక్షుడు ట్రంప్‌కు ఏం చేయాలో ఎవరైనా చెప్పగలరని అనుకుంటున్నారా? అది అసాధ్యం" అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. నిర్ణయం పూర్తిగా తనదేనని ట్రంప్ స్పష్టం చేసినప్పటికీ, ఆ ఫోన్ కాలే యుద్ధానికి ముగింపు పలికిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు