Myanmar: మయన్మార్ లో ఉద్రిక్తతలు..ఆసుపత్రిపై దాడిచేసిన సైన్యం..31 మంది మృతి

మయన్మార్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి పశ్చిమ రఖైన్‌లోని ఒక ఆసుపత్రిపై మయన్మార్ సైనిక దళాలు వైమానికి దాడి జరిపాయి. ఇందులో 31 మంది మరణించగా..మరో 70 మందికి గాయాలయ్యాయి. 

New Update
myanmar

మయన్మార్ లో  పశ్చిమ రఖైన్‌లో పిస్తులు చాలా దారుణంగా మారాయి. అక్కడి సైన్యం చేస్తున్న దాడులు సివిల్ వార్ కు దారి తీస్తున్నాయి. తాజాగా సైన్యం పశ్చిమ రఖైన్‌లోని ఓ ఆసుపత్రిపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. రఖైన్‌లోని మ్రౌక్ యు టౌన్‌షిప్‌లోని ఆసుపత్రిపై అర్థరాత్రి బాంబులు వేసింది. ఇందులో 31 మంది చనిపోయారు. మరో 70 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వైమానిక దాడిలో మ్రౌక్ యు జనరల్ హాస్పిటల్ పూర్తిగా ధ్వంసమైంది. ఆసుపత్రిపై ప్రత్యక్ష దాడి జరగడం వల్లే ఎక్కువ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది.మిగిలిన రోగులను సురక్షిత ప్రదేశానికి తరలించారు.

ప్రజలపై ఆర్మీ దాడులు..

నోబెల్ గ్రహీత ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని 2021లో పడగొట్టిన తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను సైన్యం అణచివేసినప్పటి నుండి మయన్మార్ సంఘర్షణలతో అట్టుడుకుతోంది. దానికి తోడు ఈ నెలాఖరులో అక్కడ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీని ముందు సైన్యం దాడులు చేయాలని నిశ్చయించుకుంది. డిసెంబర్ 28 నుంచి మయన్మార్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది మొత్తంలో జనవరి నుండి నవంబర్ చివరి వరకు.. సైనిక దళాలు 2,165 వైమానిక దాడులు నిర్వహించాయి. మరోవైపు అక్కడ సైనిక పాలనకు వ్యతిరేకంగా కూడా పోరాటం జరుగుతోంది. వీరు ఈ నెలాఖరున జరగనున్న ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఓట్లు వేయకుండా ఇంటి లోపలే ఉండాలంటూ ఉమ్మడి నిరసన చేపట్టారు. 

Advertisment
తాజా కథనాలు