Iran: F-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ ఎలా దెబ్బతీసిందో తెలుసా.. వెలుగులోకి సంచలన నిజాలు

ఇటీవల ఇరాన్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. అమెరికాకు చెందిన స్టెల్త్‌ ఫైటర్‌ జెట్ F-35 విమానాన్ని టార్గెట్‌ చేసి దెబ్బతీసినట్లు పేర్కొంది. మరీ ఇరాన్‌ ఈ యుద్ధవిమానాన్ని ఎలా టార్గెట్ చేయగలిగింది అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

New Update
US F-35 fighter jet downed after being targeted by Iran

US F-35 fighter jet downed after being targeted by Iran

మిడిల్ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం 23వ రోజుకు చేరింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఇటీవల ఇరాన్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. అమెరికాకు చెందిన స్టెల్త్‌ ఫైటర్‌ జెట్ F-35 విమానాన్ని టార్గెట్‌ చేసి దెబ్బతీసినట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇరాన్ ప్రభుత్వ మీడియా రిలీజ్ చేసింది. అయితే F-35 విమానం దెబ్బతిన్నప్పటికీ తమ విమానం, పైలట్లు ఇద్దరు సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. మరీ ఇరాన్‌ ఈ యుద్ధవిమానాన్ని ఎలా టార్గెట్ చేయగలిగింది అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 

Also Read: వినాశనానికి కేరాఫ్  డర్టీ బాంబ్.. ఇరాన్ ప్రయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

వాస్తవానికి F-35 యుద్ధ విమానాన్ని గుర్తించడం, దాన్ని టార్గెట్‌ చేయడం కష్టతరమైన పనిగా పరిగణించేవారు. దీనికి 360 డిగ్రీల నిఘా సామర్థ్యం ఉంటుంది. ఎయిర్‌ టు ఎయిర్, ఎయిర్‌ టు గ్రౌండ్ దాడులు చేయడంతో పాటు అలాగే గూఢచర్య మిషన్లను నిర్వహించగలదు. గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో, 2200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. సుమారు 8100 కిలోగ్రాముల బాంబులు, క్షిపణులను మోసుకెళ్లగలదు. ఇలాంటి అత్యాధునిక యుద్ధ విమానాన్ని ఇరాన్ ఎలా దెబ్బకొట్టింది అనేదానిపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

బవార్-373 క్షిపణి వ్యవస్థతో అటాక్

పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. గత గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఇరాన్.. అమెరికాకు చెందిన F-35ను లక్ష్యంగా చేసుకుంది. చైనా, రష్యా సహకారంతో రూపొందించిన ఎఫ్‌-35పై దాడి చేసేందుకు ఇరాన్‌.. బవార్-373 క్షిపణి వ్యవస్థను ఉపయోగించి ఉండొచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్-35 లాంటి స్టెల్త్‌ జెట్‌లు, గైడెడ్‌ క్షిపణులు, డ్రోన్లను గుర్తించి టార్గెట్‌ చేసుకునేందుకే దీన్ని ప్రత్యేకంగా తయారుచేసినట్లు తెలుస్తోంది. ఇందులో రష్యాకు చెందిన S-400, అమెరికాకు చెందిన 'థాడ్‌' (Terminal High Altitude Area Defense)లకు సమానమైన సామర్థ్యాలు ఉన్నట్లు ఇరాన్ చెబుతోంది. 

Also Read: న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో ప్రమాదం..  విమానాన్ని ఢీకొట్టిన ఫైర్ ట్రక్!

బవార్-373 క్షిపణి వ్యవస్థలో ఉండే సయ్యాద్ 4బి మిస్సైల్స్ సుదూర లక్ష్యాలను ఛేదించగలవు. ఇందులో ఉన్న రాడార్లు ఏకకాలంలో వందలాది టార్గెట్‌లను ట్రాక్ చేయగలవు. స్టెల్త్‌ విమానం నుంచి వచ్చే చిన్న సిగ్నల్స్‌ను కూడా పసిగట్టి వెంబడిస్తాయి. F-35ను 'దెబ్బతీశామని' ఇరాన్ చెబుతున్నా కూడా అమెరికా మాత్రం దాన్ని ఖండిస్తోంది. తమ విమానం, పైలట్లు సురక్షితంగా ల్యాండ్ అయినట్లు చెబుతోంది. 

Advertisment
తాజా కథనాలు