నేను జైలులో ఉన్నప్పుడు మన్మోహన్‌ అండగా ఉన్నారు..మలేషియా ప్రధాని ఎమోషనల్‌ ట్వీట్!

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతి పై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు.

New Update
ex pm

Manmohan singh

Manmohan Singh : భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల దేశం మొత్తం నివాళులు అర్పిస్తోంది. ఆధునిక భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ అంటూ కొనియాడుతుంది. ఆయన మృతి పట్ల ప్రపంచదేశాధినేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతి పై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. 

Also Read: Kumbhamela: కుంభమేళా ఎఫెక్ట్‌..రెండు నెలలు ఆ రైలు రద్దు!

భారత ఆర్థిక సంస్కరణలకు రూపశిల్పిగా మన్మోహన్ సింగ్‌ని అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా భారత్ ఆవిర్భవించడానికి సహకరించారని పేర్కొన్నారు. 1990లో తాము ఇద్దరం ఆర్థిక మంత్రులుగా పనిచేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇద్దరం కూడా అవినీతికి వ్యతిరేకంగా పనిచేశామన్నారు. మన్మోహన్ సింగ్ నిజంగా ప్రశంసలకు అర్హుడన్నారు. రాజకీయ నాయకుడిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ,  దృఢంగా నిలబడి రాబోయే తరాలకు స్పూర్తినిచ్చే వారసత్వాన్ని మిగిల్చినట్లు చెప్పారు.

Also Read: Ap Rains: ఏపీలో రానున్న రెండ్రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు!

Malaysian Prime Minister's Emotional tweet About Manmohan Singh

Also Read: దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన మన్మోహన్.. ఆయన తీసుకున్న కీలక నిర్ణయలివే!

నేను జైలులో ఉన్న సమయంలో, తనపై మన్మోహన్  ఎంతో  జాలి చూపించారని పేర్కొన్నారు. తన పిల్లలకు, ముఖ్యంగా తన కొడుకు ఇహ్సాన్‌కి స్కాలర్‌షిప్ ఇచ్చిన విషయాన్ని గురించి ఆయన గుర్తు చేసుకున్నారు.  అయితే, తాను ఆ ఆఫర్‌ని తిరస్కరించానని, ఇది మన్మోహన్ సింగ్ అసాధారణమైన మానవత్వాన్ని, ఔదార్యాన్ని సూచిస్తుందన్నారు. తాను జైలులో ఉన్న చీకటి రోజుల్లో తనకు నిజమైన స్నేహితుడిగా నిలిచారని, మన్మోహన్ సింగ్ తన హృదయంలో నిలిచిపోతారని చెప్పారు. 

ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా  వీడ్కోలు మిత్రమా, నా సోదరుడా మన్మోహన్ సింగ్ అంటూ  సంతాప సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

Also Read: Manmohan : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి..7 రోజులు సంతాప దినాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు