/rtv/media/media_files/2026/03/23/air-canada-plane-2026-03-23-14-42-16.jpg)
air canada plane
న్యూయార్క్‌లోని ఓ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో గేట్ వైపు వెళ్తున్న ఎయిర్ కెనడా జెట్ విమానం రన్‌వేపై ఆగి ఉన్న అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన లాగార్డియా విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
air canada plane laguardia airport
న్యూయార్క్‌లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో లాగార్డియా విమానాశ్రయం ఒకటి. ఇక్కడ నుంచి ప్రతి రోజు ఎంతోమంది ప్రయాణికులు జర్నీ చేస్తుంటారు. అయితే ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా భారీ ప్రమాదం జరిగింది. మాంట్రియల్ నుండి న్యూయార్క్‌కు వచ్చిన ‘ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ CRJ-900’ విమానం ల్యాండింగ్ తర్వాత గేట్ వైపు వెళ్తుండగా.. రన్‌వేపై ఉన్న ఒక పెద్ద ఫైర్ ట్రక్కును ఢీకొట్టింది.
An Air Canada 🇨🇦 Express plane AZZ 646 (CRJ-900) collided with a ground vehicle at New York's La Guardia Airport
— Sunil Yadav (@sunilyadav21) March 23, 2026
Pilot and co-pilot killed in collision involving plane and fire truck at LaGuardia Airport in New York.#Planecrashpic.twitter.com/r9RJ8XHXPW
ఈ ఘోరమైన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే అత్యవసర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. కాగా ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దాని ప్రకారం.. ప్రమాదం ధాటికి విమానం ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జైనట్లు కనిపిస్తుంది. ఇక ఈ విమాన ప్రమాదం కారణంగా.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) లా గార్డియా విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను నిలిపివేసింది.
An Air Canada 🇨🇦 Express plane AZZ 646 (CRJ-900) collided with a ground vehicle at New York's La Guardia Airport 🇺🇸, flight tracking website FlightRadar24 said in post on X late on Monday.
— Saad Abedine (@SaadAbedine) March 23, 2026
The U.S. Federal Aviation Administration issued a ground stop for… pic.twitter.com/ZgYAKdQCfN
అందిన సమాచారం ప్రకారం.. ఆ సమయంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం, పొగమంచు కారణంగా విజిబిలిటీ క్లియర్‌గా లేకపోవడమే ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. విమానం రన్‌వేపై అగ్నిమాపక వాహనం ఎందుకు ఉందో ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, భద్రతా ప్రమాణాలను సమీక్షిస్తామని నియంత్రణ సంస్థ పేర్కొంది.
Follow Us