Japan:జపాన్ ఎయిర్ లైన్స్ గురువారం సైబర్ దాడికి గురైంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయినట్లు ఆ సంస్థ ఎక్స్ వేదికగా తెలిపింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. Also Read: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం! ఈరోజు ఉదయం 7.24 గంటల నుంచి మా అంతర్గత, బాహ్య నెట్ వర్క్ లలో లోపాలను గుర్తించాం.దీంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడింది. సిస్టమ్ లో సమస్య కారణంగా నేటి విమాన సర్వీసుల టికెట్ సేల్స్ ను నిలిపివేశాం.ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. Also Read: TG: చేసిందంతా కేటీఆరే.. దానకిశోర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు! ప్రస్తుతం సిస్టమ్ ను సరిచేసేందుకు మా సాంకేతిక బృందం శ్రమిస్తోంది అని జపాన్ ఎయిర్ లైన్స్ తమ పోస్టులో వెల్లడించింది. అయితే సైబర్ దాడి కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. బ్యాగేజ్ చెక్ ఇన్ సిస్టమ్ పని చేయకపోవడంతో పలు ఎయిర్ పోర్టుల్లో ఈ సంస్థకు చెందిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. Also Read: Viajyawada: డిసెంబర్‌లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు..ఏపీలో విచిత్రం! జపాన్ ఎయిర్ లైన్స్ ఆ దేశంలోని రెండో అతిపెద్ద విమానయాన సంస్థ. సైబర్ దాడి వార్తలు బయటకు రాగానే స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు 2.5 శాతం మేర పడిపోయాయి.గత కొన్ని సంవత్సరాలుగా జపాన్ లో పలు సంస్థలపై వరుసగా సైబర్ దాడులు జరుగుతున్నాయి. Also Read: TG:కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతిలో బిగ్ ట్విస్ట్..ఎస్సై మృతదేహం లభ్యం ఈ ఏడాది జూన్ లో వీడియో షేరింగ్ వెబ్‌సైట్ నికోనికో పై సైబర్ నేరగాళ్లు దాడి చేయడంతో దాని సేవలను నిలిపివేయాల్సి వచ్చింది.గతేడాది జపాన్ లోని అత్యంత రద్దీ అయిన నగోయా పోర్ట్ పై రాన్సమ్ వేర్ దాడి జరిగింది. రష్యా కేంద్రంగా పని చేసే లాక్ బిట్ గ్రూపు ఈ దాడికి పాల్పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.