అమెరికా F-35ని ఢీకొట్టాం.. ఇరాన్ సంచలన ప్రకటన.. వీడియో విడుదల

పశ్చిమాసియాలో సాగుతున్న ఉద్రిక్తతలు మరిన్ని మలుపులు తిరిగుతున్నాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన 'ఎఫ్‌-35' (F-35) యుద్ధ విమానాన్ని ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
F 35 Fighter Jet

F 35 Fighter Jet

పశ్చిమాసియాలో సాగుతున్న ఉద్రిక్తతలు మరిన్ని మలుపులు తిరిగుతున్నాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన 'ఎఫ్‌-35' (F-35) యుద్ధ విమానాన్ని ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకుంది. అర్ధరాత్రి దాటాక తర్వాత తమ సరిహద్దుల్లోకి వచ్చిన ఈ అధునాతన యుద్ధ విమానాన్ని క్షిపణితో దెబ్బతీశామంటూ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. ఆ విమానం పూర్తిగా ధ్వంసమయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. 

Also Read: ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ.. మిస్సైల్‌ ప్లాంట్‌ను ధ్వంసం చేసిన అమెరికా

ఈ దాడిని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఒక ఫైటర్ జెట్ సాంకేతిక లోపం వల్ల అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు కెప్టెన్ టిమ్ హాకిన్స్ వెల్లడించారు. ఆ విమానం సురక్షితంగానే దిగిందని చెబుతూనే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. శత్రు క్షిపణుల దాడికి గురై F35 లాంటి పవర్‌ఫుల్‌ విమానం అత్యవసరంగా ల్యాండ్ అవ్వడం రక్షణ రంగంలో ఇదే మొదటిసారి. 

Also Read: ఇరాన్‌ యురేనియం శుద్ధి చేయలేదు.. యుద్ధం అనుకున్నదాని కన్నా ముందుగానే ముగుస్తుంది: నెతన్యాహు

ఇదిలాఉండగా ఎఫ్‌-35 యుద్ధ విమానం విలువ దాదాపు రూ. 769 కోట్లకు పైగానే ఉంటుంది. ఇందులో  అత్యున్నతమైన 'స్టెల్త్' టెక్నాలజీ ఉంటుంది. రాడార్లకు చిక్కకుండా శత్రువుల కనిపంచకుండా ఉండటంలో ఈ యుద్ధ విమానం దిట్ట. ఇలాంటి విమానాన్ని ఇరాన్ అడ్డుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన వల్ల ఇరు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రతరం కానుంది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్‌పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు