Trump: ట్రంప్ నుంచి గ్రీన్‌లాండ్‌ను రక్షిస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఇరాన్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నుంచి గ్రీన్‌లాండ్‌ను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

New Update
Iranian police chief offers to protect Greenland from Trump

Iranian police chief offers to protect Greenland from Trump

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఇరాన్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నుంచి గ్రీన్‌లాండ్‌ను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ''గ్రీన్‌లాండ్‌ను అప్పగించాలని ట్రంప్ ముందుగా యూరప్‌ను బెదిరించారు. ఆ తర్వాత వాళ్లను బతిమిలాడి ఇప్పుడు దాన్ని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారు. ఐరోపాకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీరు మీ గ్రీన్‌లాండ్‌ను కాపాడుకోలేకపోతే మా సాయం అడగండి. లేకపోతే మేము దాన్ని రక్షిస్తామని'' అన్నారు. 

Also Read: కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి.. 12 మందికి సోకిన వైరస్.. భయాందోళనలు స్థానికులు

ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్.. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీనిపై చర్చలు జరగాలని కూడా ఆయన అన్నారు. కానీ దీనికి డెన్మార్క్‌ ఒప్పుకోలేదు. ఎవరికీ గ్రీన్‌లాండ్‌ను ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. దీంతో ఎలాంటి ఒప్పందం జరగలేదు. గ్రీన్‌లాండ్‌ విషయంలో తమకు సపోర్ట్ ఇవ్వని ఈయూ దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించారు. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. అయితే తాజాగా ఇరాన్ అధికారి చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి.  

Also Read: విమానంలో విషాద ఘటన.. మహిళ మృతి.. మృతదేహంతోనే ప్రయాణం

Advertisment
తాజా కథనాలు