/rtv/media/media_files/2026/03/22/iran-war-2026-03-22-10-22-38.jpg)
Iran War
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అణు పరిశోధనా కేంద్రం టార్గెట్‌గా బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. అణు పరిశోధన కేంద్రం సమీపంలో ఉన్న భవనాలపై ఈ మిస్సైల్స్ పడ్డాయి. కానీ ఈ పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదు. పౌరుల నివాసాలపై దాడులు జరగడం వల్ల 100 మందికి పైగా గాయాలపాలయ్యారు.
శనివారం ఇరాన్‌పై కీలకమైన అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్‌పై దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ దాడులు చేసినట్లు సమాచారం. ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణలు ప్రయోగించగా.. వీటిని అడ్డుకోవంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అరాద్, డిమోనా నగరాల్లో నివాస ప్రాంతాలపై మిస్సైల్స్ పడ్డాయి.
Also Read: కేంద్రం వలస కూలీలకు వరం.. ఫ్రీగా LPG గ్యాస్ సిలిండర్లు పంపిణీ!
అరాద్‌లో జరిగిన దాడిలో దాదాపు 88 మంది గాయపడ్డారు. వీళ్లలో 10 మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు రెస్క్యూ టీమ్ తెలిపారు. మరో 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిచించారు. ఈ దాడుల్లో కొందరు మరణించి ఉంటారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. కానీ అధికారులు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే భవన శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు చెప్పారు.
ఇక డిమోనా నగరంలో ఓ భవనంపై మిస్సైల్ దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారు. వీళ్లలో 10 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇదిలాఉండగా ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో గాయపడ్డవారికి వైద్యసాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ దాడులకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
Also Read: మొదటిసారి యుద్ధంపై నోరు మెదిపిన మోదీ.. ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి.. కీలక చర్చలు!
Follow Us