/rtv/media/media_files/2026/03/08/iran-us-war-2026-03-08-08-56-04.jpg)
Iran US Israel drone conflict
ఇజ్రాయెల్, అమెరికాల సంయక్త దాడులను(iran israel attack) సింగిల్‌గానే ఎదుర్కొవడమే కాకుండా ఆ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది ఇరాన్. అదే సమయంలో అమెరికా మిత్ర రాజ్యాల మీద కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ దేశానికి చెందిన షాహెద్-136 మోడల్ డ్రోన్లను ఇజ్రాయెల్, అమెరికాలు కాపీ చేస్తున్నాయని ఆరోపించింది. అంతేకాక కాపీచేసిన డ్రోన్లతో ఇతర దేశాలపై దాడులకు పాల్పడుతూ ఆ నిందను తమపై రుద్దుతున్నారని ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది.
Also Read : మన గ్యాస్ వచ్చేస్తోంది.. హోర్మూజ్ జలసంధిని దాటిన భారతీయ నౌకలు
Iran US Israel Drone Conflict
తమపై దాడులు చేస్తున్నవారినే తాము టార్గెట్ చేశామని కానీ, ప్రపంచ దేశాల ముందు ఇరాన్(iran israel war 2)ను ఉద్దేశపూర్వకంగా దోషిగా నిలబెట్టేందుకు కాపీ చేసిన డ్రోన్లను జనావాసాలపైకి ప్రయోగిస్తున్నాయని ఇరాన్ సైనిక అధికారి ఆరోపించినట్లు స్థానిక మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది. తమ సైనిక సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు టెహ్రాన్‌కు వ్యతిరేకంగా రాజకీయ శక్తులను కూడగట్టడంలో అమెరికా, ఇజ్రాయెల్ విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. దీంతో మోసపూరిత కుట్రలకు తెగపడుతున్నారని ఇరాన్ ఆరోపించింది. తుర్కియే, కువైట్, ఇరాక్ వంటి దేశాల్లో ఇటీవల జరిగిన అనుమానాస్పద దాడులకు తమకు సంబంధం లేదని ఇరాన్ తెలిపింది. ఈ ఘటనలకు ఇరాన్ బలగాలే కారణమని పాశ్చాత్య మీడియా, శత్రు సంస్థలు తమపై నిందలు మోపాయని ఇరాన్ వెల్లడించింది. ఇలా దాడులు చేసి ఇరాన్‌పై అనుమానాలు రేకెత్తించడంతో పాటు పొరుగు దేశాలతో సంబంధాలను దెబ్బతీయడమే లక్ష్యంగా శుత్రు దేశాలు పనిచేస్తున్నాయని ఇరాన్ సైనిక ప్రతినిధి ఒకరు ఆరోపించారు.
ఇటీవల సైప్రస్‌లోని బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ అక్రోటిరి స్థావరంపై ఓ డ్రోన్ దాడి జరిగిందని అతను తెలిపారు.. కానీ, ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ సైనిక అధికారి స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక కార్యకలాపాలు అత్యంత క్రమశిక్షణతో కొనసాగుతున్నాయని, ఎంపిక చేసిన లక్ష్యాలపైనే తాము దాడులు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆ దేశాల మోసాలను అడ్డుకునేందుకు ప్రాంతీయ సహకారం అవసరమని సదరు అధికారి వెల్లడించారని ప్రెస్ టీవి పేర్కొనడం విశేషం.
ప్రాంతీయ దేశాలు ఐక్యత, సహకారాన్ని కొనసాగిస్తూ శత్రువుల దురాక్రమణదారులను నిలువరించాలని ప్రెస్ టీవీ వెల్లడించింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్(Iran Israel America War) ల మధ్య యుద్ధంలో డ్రోన్ల దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అయితే పశ్చిమాసియాలోని ఆయా దేశాలపై ఇరాన్ పెద్దఎత్తున షాహెద్ డ్రోన్లను ప్రయోగిస్తోంది. అయితే ఇవేమీ తమవి కావని ఇరాన్ పేర్కొనడం గమనార్హం.
Also Read : ఇంధన సర్‌ఛార్జీల బాదుడు.. అదే బాటలో ‘ఆకాశ ఎయిర్’
Follow Us