Iran: యుద్ధంలో కీలక పరిణామం.. హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ దాడులు..

హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. సముద్రంలోని అమెరికా-యూకే సైని స్థావరమైన డిగో గార్సియా టార్గెట్‌గా ఈ మిస్సైల్స్‌ను ప్రయోగించింది.

New Update
Iran Fires Missiles At Indian Ocean US-UK Base

Iran Fires Missiles At Indian Ocean US-UK Base

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. సముద్రంలోని అమెరికా-యూకే సైని స్థావరమైన డిగో గార్సియా టార్గెట్‌గా ఈ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. కానీ ఇవి టార్గెట్‌ను చేరుకోలేదని సమాచారం. ఒకటి మార్గమధ్యంలోనే ఫెయిల్‌ అవ్వగా.. మరొకదాన్ని తాము అడ్డుకున్నట్లు అమెరికా అధికారులు చెప్పారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఇక వివరాల్లోకి వెళ్తే.. డిగో గార్సియా అనేది హిందూ మహాసముద్రంలో అమెరికా-యూకేకు సైనిక స్థావరంగా ఉంది. ఈ సముద్రంలో చాగోస్ అనే పేరుతో 60 దీవుల సముదాయం ఉంది. ఇందులో అన్నిటికన్నా పెద్దదే డిగో గార్సియా. ఆఫ్రికా, పశ్చిమాసియాలోని కార్యకలపాలు చేసేందుకు అమెరికా దీన్ని వాడుతోంది. మరోవైపు హర్ముజ్ జలసంధిని తెరవడం కోసం ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ఐలాండ్‌ను అమెరికా ఆక్రమించుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: గల్ఫ్ దేశాల చమురు కష్టాలు.. ఈ ప్రత్యామ్నాయ మార్గాలు సరిపోతాయా?

దీంతో పశ్చిమాసియాలో మరో మూడు యుద్ధనౌకలను మోహరించడం కోసం అమెరికా రెడీ అయ్యింది. USS బాక్సర్, మరో రెండు యుద్ధ నౌకలు, 2500 మంది నావీ సిబ్బందితో పశ్చిమాసియా వైపు వెళ్తున్నాయి. అమెరికాకు చెందిన ట్రిపోలీ అనే భారీ యాంఫిబియస్‌ అసాల్ట్‌ షిప్ పశ్చిమాసియా వైపు కదులుతోంది. ఇదిలాఉండగా ఇరాన్‌పై సైనిక చర్యను తగ్గించేందుకు పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. 

ఇలాంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ క్షిపణుల ప్రయోగం బయటపడింది. తమవద్ద 2 వేల కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లే క్షిపణులు ఉన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు. కానీ వీటి పరిధి అంతకన్నా ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉందని తాజాగా జరిగిన ఘటన సూచిస్తోంది.  

Also Read: బాలిక ప్రాణం తీసిన సోషల్ మీడియా ఛాలెంజ్.. మెడకు తాడు బిగించుకుని

Advertisment
తాజా కథనాలు