/rtv/media/media_files/2026/03/29/iran-claims-it-struck-american-awacs-aircraft-in-saudi-airbase-strike-2026-03-29-20-47-49.jpg)
Iran Claims It Struck American AWACS Aircraft In Saudi Airbase Strike
పశ్చిమాసియా బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తుండగా.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై, ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. శత్రువుల రాకను పసిగట్టి అమెరికా సైన్యానికి సమాచారాన్ని అందించే ఈ3 సెంట్రీ అవాక్స్ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేసింది. ఈ విమానాన్ని ఇరాన్.. బాలిస్టిక్ మిస్సైళ్లతో ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఈ విమానం సౌదీ అరేబియాలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మార్చి 27న రియాద్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ మిస్సైల్ ఈ విమానాన్ని టార్గెట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఈ దాడిలో 10 నుంచి 12 మంది సైనికులకు తీవ్రంగా గాయాలయ్యాయని.. వాళ్లలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపాయి. విమానం ధ్వంసమైన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ యుద్ధ విమానానికి నష్టం తీవ్రంగా జరగడం వల్ల మళ్లీ దాన్ని మరమ్మతు చేసి తిరిగి వాడటం సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ దాడిని అమెరికా రక్షణ శాఖ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
ఈ-3సెంట్రీ అవాక్స్ అంటే ?
ఈ-3 సెంట్రీ అవాక్స్ విమానం యుద్ధంలో అమెరికాకు ఎంతో కీలకమైనది. ఇది వందల మైళ్ల మేరకు గగనతలాన్ని పర్యవేక్షించగలదు. దూసుకొచ్చే శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, విమానాలను గుర్తించి మిత్ర దళాలకు ముందస్తుగానే సమాచారం ఇస్తుంది. అయితే ఈ3 సెంట్రీ ఎయిర్‌బోర్న్ ధ్వంసం కావడం పెద్ద విషయమని మాజీ అమెరికా వైమానికి దళ కల్నల్ జాన్ జేవీ వెనబుల్ అన్నారు. గల్ఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేకునేందుకు ఈ ఘటన విఘాతం కలిగిస్తుందని తెలిపారు.
Newly released images capture the damage caused to an American E-3 AWACS plane in Iranian retaliatory strikes on Prince Sultan Air Base in Saudi Arabia.
— Press TV 🔻 (@PressTV) March 29, 2026
Follow Press TV on Telegram: https://t.co/LWoNSpkc2Jpic.twitter.com/ftFLmC5wuB
🚨 JUST IN: 🇮🇷🇺🇸
— IranDefenceForce (@IranDefenceForc) March 29, 2026
Reports suggest a U.S. Air Force aircraft may have been damaged or destroyed following Iranian strikes at Prince Sultan Air Base in Saudi Arabia. pic.twitter.com/8Gigwrq7tx
దెబ్బతిన్న అమెరికా ఖరీదైన విమానాలు
ఈ యుద్ధంలో అమెరికా సైన్యానికి కూడా భారీగా నష్టం జరిగింది. కనీసం 17 అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇందులో F‑35 స్టెల్త్ ఫైటర్, F‑18 జెట్, అత్యంత కీలకమైన ఈ‑3 సెంట్రీ అవాక్స్ లాంటి విమానాలు ఉన్నాయి. ఈ విమానాలు అమెరికా వైమానిక దళానికి అత్యంత ఖరీదైన, వ్యూహాత్మక ఆయుధాలుగా గుర్తింపు పొందాయి.
బిలియన్ డాలర్ల నష్టం
F‑35 స్టెల్త్ ఫైటర్ ఒక్కో విమానం ధర సుమారు 80–100 మిలియన్ డాలర్లు (రూ.6,600– రూ.8,300 కోట్లు) ఉంటుంది. F‑18 జెట్ ధర సుమారు 60 మిలియన్ డాలర్లు (రూ.5,000 కోట్లు) ఉంటుంది. ఇక ఈ‑3 సెంట్రీ అవాక్స్ విమానం అప్‌గ్రేడ్‌లతో కలిపి 400 మిలియన్ డాలర్లు (రూ.3,000 కోట్లు)గా ఉంది. ఈ యుద్ధం అమెరికాకు బిలియన్ల డాలర్లు నష్టం జరిగింది. ఇప్పటిదాకా ఈ యుద్ధం వల్ల అమెరికా $18 నుంచి $40 బిలియన్ డాలర్ల వరకు ( రూ.1.7- రూ.3.8 లక్షల కోట్లు) నష్టపోయినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి
Follow Us