/rtv/media/media_files/2026/03/29/fotojet-15-2026-03-29-10-54-43.jpg)
Iran Dubai attack
Iran Dubai attack : ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ రెచ్చిపోయింది. దుబాయ్‌లోని అమెరికాకు చెందిన రెండు రహస్య స్థావరాలపై విరుచుకుపడింది. ఆ రెండు స్థావరాలను దారుణంగా దెబ్బతీసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ వెల్లడించింది. ఆ రెండు రహస్య స్థావరాల్లో దాదాపు 500 మంది అమెరికా సైనికులు ఉన్నారని, భారీగా ప్రాణనష్టం సంభవించిందని ఐఆర్‌జీసీ వెల్లడించడం సంచలనంగా మారింది.
ఇరాన్‌కు మద్దుతుగా ఒకవైపు హౌతీలు యుద్ధంలోకి దిగగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ సైతం తన పోరాటాన్ని ఉదృతం చేసింది. గల్ఫ్ కంట్రీస్‌లో అమెరికా ఏర్పాటు చేసుకున్న పలు రహస్య స్థావరాలను టార్గెట్ చేస్తోంది. అలాగే అమెరికా సైన్యానికి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్న గల్ఫ్ దేశాల ఆర్థిక మూలలను దెబ్బతీసేందుకు ఇరాన్ ఆయా దేశాల ప్రధాన ప్యాక్టరీలు, ఇంధన పరిశ్రమలపైన ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా రెండు స్థావరాలపైనా క్షిపణి, డ్రోన్‌లతో దాడిచేసినట్టు ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఆ రెండు స్థావరాలపై దాడుల నేపథ్యంలో అమెరికా సైనికులకు తీవ్ర ప్రాణనష్టం జరిగిందని తెలిపింది. ఈ విషయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు అక్కడి సైనిక కమాండర్లకు అర్థమయ్యే ఉంటుందని ఐఆర్‌జీసీ కమాండర్ ఒకరు వెల్లడించారు. కాగా అమెరికా సైనికులకు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. కాగా, తాజా దాడుల నేపథ్యంలో గాయపడిన అమెరికన్ సైనికులను రక్షించడానికి, చికిత్స అవసరమైన వారిని ఆసుపత్రులకు తరలించడానికి దుబాయ్‌లోని అంబులెన్స్‌లు గంటల తరబడి పరుగులు పెట్టడం కనిపించిందని ఇరాన్ మీడియా వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇది వరకే గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాలపై దాడులు ఆగాలంటే, ఆయా దేశాల్లో ప్రశాంతత నెలకొని అభివృద్ధి జరగాలన్నా తమ మాట వినాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. గల్ఫ్ గగన తలాలను వినియోగించుకుని ఇరాన్‌పై దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌కు ఆయా దేశాలు అనుమతి నిరాకరించాలని పెజెష్కియాన్ పిలుపునిచ్చారు. అలా చేస్తేనే గల్ఫ్ దేశాలపై దాడులు ఆగుతాయని తేల్చి చెప్పారు.
Follow Us