/rtv/media/media_files/2025/02/19/Nfs7lBmVZdNWTP1gjQRZ.jpg)
Illegal Immigrants In Panama
అమెరికా (America) వరసపెట్టి అక్రమవలసదారులను వెనక్కు పంపేస్తోంది. ఇందులో భారత్ (India) తో పాటూ పలు దేశాల వాళ్లు కూడా ఉంటున్నారు. ఇండియాకు ఇప్పటివరకు రెండు విడతల్లో రెండు విమానాలు వచ్చాయి. దాదాపు 250 మందిని వెనక్కు పంపారు. మరో విమానం కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ఇదే క్రమంలో అమెరికాలో ఉన్న అక్రమలవలసదారులను తమ దేశంలోకి ఆహ్వానిస్తామని పనామా ప్రకటించింది. దాదాపు 300 మంది వలసదారులు తమ దేశానికి చేరినట్లు పనామాకు చెందిన మంత్రి ఫ్రాంకా అబ్రెగో తెలిపారు. అయితే ఇందులో 40శాతం మంది తిరిగి తమ స్వదేశానికి వెళ్ళేందుకు ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. తమ దేశానికి వచ్చినవారిలో భారత్, ఇరాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ దేశాలకు చెందిన వారు ఉన్నారని పనామా అధికారులు తెలిపారు.
Also Read : నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!
Also Read : భారత్ లో టెస్లా..ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!
హోటల్ లో అక్రమ వలసదారులు..
అమెరికా నుంచి వచ్చిన వారందరినీ పనామాలో ఓ హోటల్ లో ఉంచారు. ఈ మొత్తం ప్రక్రియకు అయ్యే ఖర్చును అమెరికానే భరిస్తోంది. వలసదారులను ఉంచుతున్న హోటల్ పటిష్టమైన భద్రతల మధ్య ఉంచారు. పోలీస్ అధికారులు వీరిని పర్యవేక్షిస్తున్నారు. అయితే అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వారిని హోటల్ లో నిర్భందించారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిని అక్కడి అధికారులు ఖండిస్తున్నారు. ట్రంప్ (Trump) అధ్యక్షుడు అయ్యాక...అమెరికా విదేశాంగ్ మంత్రి మార్కూ రూబియో లాటిన్ అమెరికాలో పర్యటించారు. అప్పుడు గ్వాటమాల, పనామా దేశాలతో వలసదారుల తరలింపుపై ఒప్పందాలు చేసుకున్నామని...అందులో భాగంగానే ఇప్పుడు అక్రమ వలసదారులు తమ దేశం చేరుకున్నారని చెప్పారు. మరోవైపు కోస్టారికాతో కూడా ఇలాంటి ఒప్పందాలే అమెరికా చేసుకుంది. భారత్‌తో సహా ఆసియా దేశాలకు చెందిన దాదాపు 200 మంది అక్రమ వలసదారులు తమ దేశానికి చేరుకున్నట్లు కోస్టారికా అధికారులు తెలిపారు.
Also Read: J&K: కాశ్మీర్ లో కరువు తప్పదేమో..వాతావరణశాఖ
Also Read : మహా కుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్నానం