America: భీక‌ర‌ మంచు తుఫాన్ తో వణుకుతున్న అమెరికా..7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ!

బ్లెయిర్ తుఫాన్‌ బెంబేలెత్తిస్తున్న‌ది. ఆ మంచు తుఫాన్ ధాటికి అమెరికా గ‌జ‌గ‌జ‌లాడుతోంది. పోలార్ వ‌ర్టిక్స్‌తో వీస్తున్న అతిశీత‌ల గాలుల వ‌ల్ల‌.. సెంట్ర‌ల్ అమెరికాలోని ఏడు రాష్ట్రాలు స్నోఫాల్‌తో నిండిపోతున్నాయి. -18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

New Update
america

america Photograph: (manogna us)

America: అమెరికా పై మంచు తుఫాన్ తన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వింట‌ర్ స్టార్మ్ సుమారు 6 కోట్ల మంది అమెరిక‌న్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అత్య‌ల్పంగా -18 డిగ్రీల  ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. కాన్సాస్ సిటీపై ఈ మంచు తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉంది. 

Also Read: Earth QUAKE: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంత తీవ్రతంటే?

 వెస్ట్ వ‌ర్జీనియా, అర్కాన్సాస్‌, న్యూజెర్సీ,మిస్సోరీ, కెంట‌కీ, వ‌ర్జీనియా,  రాష్ట్రాల్లోనూ మంచు తుఫాన్ బీభ‌త్సం సృష్టిస్తుంది. మంచు తుఫాన్‌కు బ్లెయిర్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. సుమారు 30 రాష్ట్రాల్లో ఆ తుఫాన్ ప్ర‌భావం ఉన్న‌ది. బ్లెయిర్ మంచు తుఫాన్ వ‌ల్ల‌.. అధిక స్థాయిలో మంచు,  స‌బ్ జీరో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నట్లు తెలుస్తుంది.

Also Read: Canada: ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో

పోలార్ వొర్టెక్స్ వ‌ల్ల విప‌రీత వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ నిపుణులు వివరించారు. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న‌ చ‌ల్ల‌టి గాలి.. సెంట్ర‌ల్ అమెరికాను తీవ్రంగా వణికిస్తుంది. ఇప్ప‌టికే వేల సంఖ్య‌లో విమానాలు ఆల‌స్యంగా నడుస్తున్నాయి.కొన్నింటిని ర‌ద్దు కూడా చేశారు. తుఫాన్ వ‌ల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లు జామ‌య్యాయి. స్కూళ్ల‌ను మూసివేశారు. 

మైన‌స్ 10 నుంచి 15 డిగ్రీల‌కు...

ఈరోజు తరువాత ప‌రిస్థితులు మెరుగ‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వెద‌ర్ శాఖ తెలిపింది.కాన్సాస్ సిటీలో 32 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ భారీ స్థాయిలో మంచు కురిసింది. రాబోయే  రోజుల్లో ఉష్ణోగ్ర‌త‌లు మ‌రీ దారుణంగా ప‌డిపోనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మైన‌స్ 10 నుంచి 15 డిగ్రీల‌కు ప‌డిపోయే అవకాశాలున్నట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. కాన్సాస్‌కు ప్ర‌త్యేకంగా అల‌ర్ట్ జారీ చేశారు. ఇళ్ల నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్దు అని హెచ్చరికలు చేశారు.

ఫిల‌డెల్పియాలో స్కూళ్లు, ప్ర‌భుత్వ ఆఫీసుల‌ను మూసివేశారు. లూసియానా, కెంట‌కీ ,  మిస్సోరీ, ఇలియ‌నాస్‌ రాష్ట్రాల్లో.. సుమారు రెండు ల‌క్ష‌ల ఇళ్లకు విద్యుత్‌ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. భారీగా కురుస్తున్న మంచు తుఫాన్‌ ల్ల‌.. కాన్సాస్ విమానాశ్ర‌యాన్ని ఇప్పటికే మూసేశారు. మంచు తుఫాన్ ప్ర‌భావం ఉన్న రాష్ట్రాల్లో.. వంద‌ల సంఖ్య‌లో కారు ప్ర‌మాదాలు చోటుచేసుకుంటున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. మిస్సోరీలో దాదాపు 600 వాహ‌నాలు హైవేపై మంచులో చిక్కుకుపోయాయి. వ‌ర్జీనియా రాష్ట్రంలో 135 ప్ర‌మాదాలు జ‌రిగాయి.

Also Read: Keir Starmer:మస్క్‌ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్‌ ప్రధాని!

Also Read: USA: హెచ్–1 వీసాదారులకు గుడ్‌ న్యూస్.. స్టాంపింగ్‌ ఇక అమెరికాలోనే...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు