Fuel Surcharges : ఇంధన సర్‌ఛార్జీల బాదుడు.. అదే బాటలో ‘ఆకాశ ఎయిర్‌’

పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు కూడా ఇంధన సర్‌ ఛార్జీల పేరుతో బాదుడు మొదలు పెట్టాయి. ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం మూలంగా గల్ఫ్ దేశాల నుంచి ఇంధన సరఫరా నిలిచిపోవడంతో విమాన ఇంధన (ATF) ధరలకు రెక్కలొచ్చాయి.

New Update
FotoJet (15)

Fuel surcharges

Fuel surcharges : పశ్చిమాసియా(west-asia) యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు కూడా ఇంధన సర్‌ ఛార్జీల పేరుతో బాదుడు మొదలు పెట్టాయి. ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం మూలంగా గల్ఫ్ దేశాల నుంచి ఇంధన సరఫరా నిలిచిపోవడంతో విమాన ఇంధన (ATF) ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో  ఆయా విమానయాన సంస్థలు ప్రయాణికుల నుంచి ఇంధన సర్‌ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించాయి.పెరుగుతున్న విమాన ఇంధన ఖర్చుల మూలంగా విమానయాన సంస్థలు అనేక దేశీయ మార్గాల్లో టికెట్ ఛార్జీలను పెంచవలసి వస్తుంది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌(air-india-express-planes), ఇండిగో సంస్థలు ఇప్పటికే ఈ ఛార్జీ వసూలు చేస్తుండగా తాజాగా ‘ఆకాశ ఎయిర్‌’ (akasa-airlines) కూడా సర్‌ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి (మార్చి 15)  దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై రూ.199 నుంచి రూ.1,300 వరకు ఇంధన సర్‌ఛార్జీలను విధించనున్నట్లు ఆకాశ ఎయిర్‌  ప్రకటించింది. మార్చి 15 నుండి, ఎయిర్‌లైన్‌తో టిక్కెట్లు బుక్ చేసుకునే విమాన ప్రయాణికులు ఈ అదనపు ఖర్చును ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొంది.

Also Read :  మన గ్యాస్ వచ్చేస్తోంది.. హోర్మూజ్‌ జలసంధిని దాటిన భారతీయ నౌకలు

Fuel Surcharges Are A Problem Akasha Air

జెట్ ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరిగిపోవడంతో అనేక విమానయాన సంస్థలు ఛార్జీలు పెంచి ఇంధన సర్‌ఛార్జీలు విధించాయి. అందులో భాగంగానే ఆకాశ ఎయిర్‌ లైన్స్‌ కూడా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రతి విమానానికి ఇంధన సర్‌ఛార్జీని వసూలు చేస్తామని, ప్రయాణ వ్యవధిని బట్టి చెల్లించాల్సిన మొత్తం మారుతుందని ‘ఆకాశ ఎయిర్’ ఓ ప్రకటనలో వివరించింది. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి మార్చి 15 నుంచి ఈ ఛార్జీలు వసూలు చేస్తామని వెల్లడించింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల కారణంగా విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయని ఆకాశ తెలిపింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంటామని, అదేవిధంగా ఇంధన సర్‌ఛార్జీలను సమీక్షిస్తామని కూడా ఆ సంస్థ వెల్లడించింది.

కాగా గతంలోనే ఇంధన సర్‌ఛార్జీలను పెంచుతామని ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌(air india express flight), ఇండిగో ప్రకటించాయి. ప్రకటించినట్లే మార్చి 12 నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో టికెట్లపై ఇంధన సర్‌ఛార్జీలను విధిస్తూ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు  నిర్ణయం తీసుకున్నాయి. ఇక మార్చి 14 నుంచి ఇండిగో సైతం ఒక్కో టికెట్‌పై రూ.425 నుంచి రూ.2,300 వరకు అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది.

పశ్చిమాసియా ఉద్రిక్తత కారణంగా ముడి చమురు ధరలు పెరగడంతో జెట్ ఇంధన ధరలు రాత్రికి రాత్రే విపరీతంగా పెరిగాయి. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ATF ప్రధానమైంది. పశ్చిమాసియా సంఘర్షణల కారణంగా తలెత్తిన సరఫరా అంతరాయాల నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయి. విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చులలో ఇంధన వ్యయం 40 శాతం వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నందున విమానయాన టర్బైన్ ఇంధన ధరలు పెరుగుతున్నాయి. విమానయాన సంస్థలు కొన్నిసార్లు ఈ భారంలో కొంత భాగాన్ని ఇంధన సర్‌ఛార్జీల రూపంలో లేదా విమాన టిక్కెట్ ధరలను పెంచడం ద్వారా ప్రయాణీకులపై భారం మోపుతుంటాయి.

Also Read :  ఇరాన్‌ భూగర్భంలో ‘క్షిపణి నగరం’...పెద్ద సంఖ్యలో సూసైడ్ డ్రోన్ల ఆర్మీ..

Advertisment
తాజా కథనాలు