వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ విడుదల.. అత్యంత సంతోషకరమైన దేశం అదే.. భారత్ ఏ స్థానంలో ఉందంటే ?

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ మరోసారి రికార్డు సృష్టించింది. వరుసగా తొమ్మిదోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్‌ గురువారం వార్షిక రిపోర్టును విడుదల చేసింది.

New Update
Finland ranks as "world's happiest country" for 9th year in a row

Finland ranks as "world's happiest country" for 9th year in a row

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ మరోసారి రికార్డు సృష్టించింది. వరుసగా తొమ్మిదోసారి అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 20న అంతర్జాతీయ ఆనంద దినోత్సవ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్‌ గురువారం వార్షిక రిపోర్టును విడుదల చేసింది. ఈసారి కూడా ఫిన్లాండ్‌ మొదటి స్థానాన్ని దక్కించుకున్నట్లు తెలిపింది. అయితే యువతపై ముఖ్యంగా పశ్చిమ ఐరాపా, ఇతర పాశ్చత్యా దేశాల్లో బాలికలపై సోషల్ మీడియాల ప్రతికూల ప్రభావం ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. 

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 25 ఏళ్లలోపు ఉన్నవారి లైఫ్‌స్టైల్ అస్థిరంగా ఉందని తెలిపింది. సోషల్ మీడియాలో గంటల తరబడి గడపడం వల్ల ఈ పరిస్థితులకు కారణం అయినట్లు పేర్కొంది. ఈ రిపోర్డు ప్రకారం.. నార్డిక్ దేశాలైనటువంటి ఐస్‌లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వేలు కూడా ఈసారి టాప్‌ 10లో నిలిచాయి. మూడేళ్ల క్రితం 2023లో 23వ స్థానంలో ఉన్న కొస్టారికా ఈసారి నాలుగో స్థానానికి చేరింది. 

Also Read: పార్లమెంట్ ఎన్నికల్లో కిమ్ జోరు.. ఉత్తర కొరియాలో ఎదురుతిరిగిన 0.7% ప్రజలు!

ఈ దేశాల్లోని ప్రజల సామాజిక జీవితాల్లో నాణ్యత, స్థిరత్వం ఉండటం వల్లే అత్యంత సంతోషకరమైన లిస్ట్‌లో చోటు సాధించినట్లు వెల్‌బీయింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జాన్‌ ఇమాన్యుయేల్‌ వెల్లడించారు. అయితే అమెరికా ఈ లిస్ట్‌లో టాప్ 23లో నిలిచింది. కెనడా 25, బ్రిటన్ 29వ స్థానాలను దక్కించుకున్నాయి. ఇక తాలిబన్లతో సంక్షోభం ఎదుర్కొంటున్న అఫ్గాన్ ఈసారి కూడా అత్యంత అసంతృప్తికర దేశంగా నిలిచింది. ఆఫ్రికాలోని సియెర్రా లియోన్, మలావి ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. 

భారత్‌ స్థానం ఎక్కడంటే 

అత్యంత సంతోషకరమైన దేశాల లిస్టులో భారత్‌ ఈసారి 116వ స్థానంలో నిలిచింది. 2024లో 118 స్థానం దక్కించుగా ఈసారి కాస్త మెరుగ్గా ఫలితాలు సాధించింది. అవినీతి, స్వేచ్ఛ, తలసరి ఆదాయం, దాతృత్వం, ఆరోగ్యకర జీవనం లాంటి విభాగాల అంశాలు చూసినప్పుడు ఈసారి పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి. ఇక మన పక్క దేశాలైన నేపాల్‌కు 99వ స్థానం రాగా.. పాకిస్థాన్ 104వ స్థానంలో నిలిచింది. 

Also Read: దేశంలో ఇంధన భద్రత.. ఆయిల్‌ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు