/rtv/media/media_files/2026/03/29/fotojet-12-2026-03-29-08-35-14.jpg)
Bahrain aluminum plant.
Bahrain: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ఉధృతమవుతున్నాయి. తాజాగా బహ్రెయిన్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం స్మెల్టర్లలో ఒకటిగా పేరుగాంచిన అల్యూమినియం బహ్రెయిన్ (Alba) ప్లాంట్‌పై ఈ రోజు (ఆదివారం) ఉదయం డ్రోన్ దాడులు జరగడం కలకలం రేపింది. ఈ దాడిలో ప్లాంట్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. కాగా. గత కొంతకాలంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ ఆ రెండు దేశాలకు చెందిన సైనిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతుంది.
కాగా తాజాగా అల్యూమినియం ప్లాంట్ పై జరిగిన డ్రోన్ దాడికి తామే కారణమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. బహ్రెయిన్ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు సహకరిస్తున్నందున ఈ దాడులు చేశామని స్పష్టం చేసింది. కాగా, ప్లాంట్‌లోని కీలక విభాగాలను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దాన్ని గుర్తించిన ప్లాంట్ సెక్యూరిటీ సిస్టమ్స్ అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ, అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ వెంటనే కిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడికి తామే బాధ్యులమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఒక ప్రకటనలో పేర్కొన్నది. బహ్రెయిన్ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు సహకరిస్తోందని, దానికి నిరసనగానే ఈ చర్యలకు పాల్పడ్డామని వారు స్పష్టం చేశారు. కాగా డ్రోన్ దాడి కారణంగా ప్లాంట్‌లోని కొంత భాగాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీనివల్ల ప్రపంచ అల్యూమినియం సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ దాడిని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాల భద్రతను పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఇరాన్ - గల్ఫ్ దేశాల మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్-అమెరికా కూటమికి మద్దతు ఇస్తున్న దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇరాన్, దాని అనుబంధ సంస్థలు దాడులకు పాల్పడుతుండటం గమనార్హం.
Follow Us