/rtv/media/media_files/2025/09/26/trump-h1b-visa-2025-09-26-10-00-08.jpg)
హెచ్ 1బీ వీసా(h-1b-visa) ఫీజు పెంపు విషయంలో అమెరికా(usa) అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) నిర్ణయంపై ఇతర దేశాలో పాటూ అమెరికాలో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కంపెనీలు అన్నీ తమ వీటోను తెలిపాయి. దీనికి సంబంధించి అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా 20 రాష్ట్రాలు దావా వేశాయి. దీనికి కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా నాయకత్వం వహించారు. లక్ష డాలర్ల ఫీజును నిలిపేయాలని దావాలో పేర్కొన్నారు. ఏ అధ్యక్షుడికి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని అందులో చెప్పారు. వలసల చట్టంతో సహా దాని సంబంధిత ఖర్చులలో ఇలాంటి కీలక మార్పులు చేసే అధికారం కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని వాదించారు. బోంటా విలేకరులతో మాట్లాడుతూ.. హెచ్-1బీ వీసాలపై అదనపు రుసుములు విధించే అధికారం ట్రంప్‌నకు లేదని అన్నారు.
Also Read : పాక్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు.. దేశవిభజన తరువాత తొలిసారిగా..
కొరత మరింత పెరుగుతుంది..
వీసాల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉంది. గతంలో హెచ్ 1బీ వీసా కార్యక్రమాన్ని కాంగ్రెస్ మెరుగు పరిచింది. పరిమితులు, ఫీజు నిర్ణయించింది. దీన్ని అమెరికా అధ్యక్షుడు మార్చారు. అయితే ఆయనకు ఆ అధికారం లేదు. ఏ అధ్యక్ష పరిపాలన ఇమిగ్రేషన్ చట్టాన్ని తిరగరాయదు. రాజ్యాంగాన్ని, చట్టాలను ఏ అధ్యక్షుడు విస్మరించరు అనిబోంటా అన్నారు. ఈ లక్ష డాలర్ల ఫీజు నిర్ణయం ప్రభుత్వం, ప్రైవేటు యజమానులపైనా ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కీలక రంగాల్లో కార్మిక కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన హెచ్-1బీ వీసాదారుల కొరత ఉందని..ఇప్పుడు అది మరింత ఎక్కువ అవుతుందని రాబ్ బొంటా చెప్పారు.
Also Read : మొరాకోలో కూలిన రెండు భవనాలు...19 మంది మృతి
సుంకాలపైనా చుక్కెదురు..
మరోవైపు భారత్‌పై ట్రంప్ విధించిన టారిఫ్స్ విషయంలో కూడా ఆయనకు అమెరికా ప్రతినిధుల సభలో ఆయనకు చుక్కెదురైంది. భారతీయ వస్తువుల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలను రద్దు చేయాలని కోరుతూ.. అమెరికా ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు తాజాగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం విశేషం. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని.. అవి అమెరికన్ కార్మికులు, వినియోగదారులు, ఇండో-యూఎస్ సంబంధాలకు హాని కలిగిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
Follow Us