నాసా చీఫ్‌గా బిలియనీర్.. ట్రంప్ కీలక నిర్ణయం

నాసా చీఫ్‌గా బిలియనీర్, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మెన్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలాన్ మస్క్‌కి వ్యాపార సహచరుడు అయిన జేర్డ్‌ నాయకత్వంలో నాసా మరింత పురోగతి సాధించాలని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

New Update
trump56

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్ట్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తులసి గబార్డ్‌ను నియమించగా, రాబర్ట్ ఎఫ్‌ కెన్నడీ జూనియర్‌ను ఆరోగ్య మంత్రిగా నియమించారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తర్వాత చీఫ్‌గా బిలియనీర్, ప్రైవేట్ వ్యోమగామి అయిన జేర్డ్ ఐజాక్‌మెన్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. 

ఇది కూడా చూడండి: యూన్‌‌పై అభిశంసన తీర్మానం.. ఎమర్జెన్సీతో పదవికి ముప్పు

ఇది కూడా చూడండి: రేపే పింక్‌ బాల్‌ టెస్ట్‌ మ్యాచ్.. టైమింగ్స్ ఇవే!

ఇలా ట్వీట్ చేస్తూ..

ఎలాన్ మస్క్ వ్యాపార సహచరుడు అయిన జేర్డ్‌ ఐజాక్‌మెన్‌ నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా) అడ్మినిస్ట్రేటర్‌గా నామినేట్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. ఇతని నాయకత్వంలో నాసా మిషన్‌ ఇంకా ఎంతో పురోగతి సాధించాలని తెలిపారు. స్పేస్‌ సైన్స్‌, టెక్నాలజీలో సరికొత్త లక్ష్యాలను చేరుకుంటుందని నమ్ముతున్నానని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు.

ఇది కూడా చూడండి: ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ ఇదే!

ఇది కూడా చూడండి:  పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు