Assembly: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో గందరగోళం.. ఏం జరిగిందంటే ?

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సోమవారం జరిగిన తొలి సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే వహీద్ పర్రా ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అభ్యంతరం తెలిపిన బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు.

New Update
jk

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సోమవారం జరిగిన తొలి సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) ఎమ్మెల్యే వహీద్ పర్రా ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఈ తీర్మానంపై అభ్యంతరం తెలిపిన బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ మాట్లాడుతూ.. ఇలాంటి తీర్మానాన్ని తాను ఇంతవరకు అంగీకరించలేదని పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీ పార్టీల సభ్యుల మధ్య గందరగోళ వాతావరణం ఏర్పడింది. 

Also Read :  భోజనంతో పాటు పచ్చిమిర్చి తింటే ప్రయోజనమా?

Also Read: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో బస్సు పడి..

Jammu & Kashmir Assembly

జమ్మూకశ్మీర్‌ స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని 2019లో మోదీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. దాదాపు ఆరేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్దరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇటీవల జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఇటీవల ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే. 

Also read: బాలుడి కడుపులో 56 వస్తువులు.. షాకైన వైద్యులు.. చివరికీ

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో గెలవగా.. కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచింది. ఎన్సీ అధినేత ఫరుక్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఇందుకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఆమోదం తెలిపారు. అయితే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రక్రియను మోదీ ప్రభుత్వం ప్రారంభించే యోచనలో ఉందని పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. 

Also Read: కెనడాలో హిందువులపై ఖలిస్థానీల దాడులు.. స్పందించిన ట్రూడో

#assembly #jammu-kashmir #Omar Abdullah #national-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు