BIT Coin: 1,00,000 డాలర్లకు బిట్‌ కాయిన్‌ !

క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ విలువ నేడు ఏకంగా 1,00,000 డాలర్లను దాటేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో కొన్నాళ్లుగా ఇది భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.

author-image
By Bhavana
New Update
Bitcoin: భారీగా పెరిగిన బిట్​కాయిన్​.. కారణం ఇదే!

BitCoin: క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ విలువ నేడు  ఏకంగా 1,00,000 డాలర్లను దాటేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో కొన్నాళ్లుగా ఇది భారీగా ర్యాలీ చేస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు వారాల్లోనే దీని విలువ 45 శాతం పెరిగిందంటే దీని దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read:  SCR: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ బాధపడనవసరం లేదు!

క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలను సడలిస్తానని ట్రంప్‌ సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇది 1,00,000 డాలర్ల మార్కును దాటేసింది. ఒక దశలో అత్యధికంగా 1,00,512 ను తాకింది. మడ్‌రెక్స్‌ సీఈవో ఈ పరిణామాల పై స్పందిస్తూ బిట్‌ కాయిన్‌ వెనక మస్క్‌ కు డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ సామర్థ్యం కట్టబెట్టడం వంటి కారణాలు ఉన్నాయి.

Also Read: Mulugu: వాజేడు ఎస్సై ఆత్మహత్య కేసు...పోలీసుల అదుపులో యువతి

దీంతోపాటు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజీ కమిషన్‌ చైర్మన్‌ గా పాల్‌ అట్కిన్‌ కు ట్రంప్‌ బాధ్యతలు అప్పగించడం వంటివి కలిసొచ్చాయి. దీంతో క్రిప్టో అనుకూల పాలసీలు వస్తాయన్న అంచనాలు బలపడ్డాయి. భవిష్యత్తులో బిట్‌కాయిన్‌ 1,20,000 డాలర్లకు కూడా చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Also Read: ఫ్రాన్స్‌ లో అనుకోని పరిణామాలు..అవిశ్వాస తీర్మానంలో ఓడిన  ప్రధాని!

గతంలో పాల్‌ అట్కిన్‌ గతంలో జార్ డబ్ల్యూ బుష్‌ హయాంలో కూడా ఎస్‌ఈసీ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత పదవిని వీడాక అమెరికాలో మార్కెట్‌ నియంత్రణ చాలా తీవ్రంగా ఉందని న్యాయపోరాటం చేశారు. తాజాగా మళ్లీ ఆయనకే ట్రంప్‌ ఎస్‌ఈసీ పగ్గాలు అప్పజెప్పడం విశేషం. అమెరికా ఎన్నికల రోజున బిట్‌ కాయిన్‌ విలువ 69,374 డాలర్లుగా ఉంది.

Also Read: ''నాన్న నువ్వే నా హీరో''.. పుష్ప2 రిలీజ్ వేళ అయాన్ స్పెషల్ లెటర్ వైరల్!

రెండేళ్ల క్రితం 17,000 డాలర్ల దిగువకు జారిపోయిన ఈ క్రిప్టో  కరెన్సీ ఇప్పుడు లక్ష డాలర్లను దాటేయడం  విశేషం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు