Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హాసినా పాస్‌పోర్టు రద్దు!

బంగ్లాదేశ్‌ లో మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.మాజీ ప్రధాని షేక్‌ హసీనా పాస్‌పోర్టును రద్దు చేసింది.ఆమెతో పాటు మరో 96 మంది పాస్‌పోర్టులను కూడా రద్దు చేసినట్లు యూనస్‌ ప్రభుత్వం ప్రకటించింది.

New Update
Sheik Hasina:షేక్‌ హసీనాపై 53కు చేరిన కేసులు..

Bnagladesh: బంగ్లాదేశ్‌ లో మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.మాజీ ప్రధాని షేక్‌ హసీనా పాస్‌పోర్టును రద్దు చేసింది.ఆమెతో పాటు మరో 96 మంది పాస్‌పోర్టులను కూడా రద్దు చేసినట్లు యూనస్‌ ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: Pandem kollu: కాలు దువ్వుతున్న పందెం కోళ్లు.. రూ.100కోట్ల బెట్టింగ్

75 మంది పై హత్య కేసులు..

రిజర్వేషన్ల అంశం పై చెలరేగిన అల్లర్లకు సంబంధించి బాధ్యుల పై నేర విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లా ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా పాస్‌పోర్టు రద్దు చేసిన వారిలో 22 మంది పై కిడ్నాప్‌ కేసులు నమోదు కాగా, 75 మంది పై హత్య కేసులు ఉన్నాయి.

Also Read: అమెరికాలో తెలుగోళ్ల భారీ కుంభకోణం.. యాపిల్‌లో 185 ఉద్యోగులు ఊస్ట్

కిడ్నాప్‌ లు, హత్యలకు పాల్పడ్డారంటూ హసీనాతో పాటు మరో 11 మందికి ఇంటర్నేషనల్‌ క్రైమ్‌ ట్రైబ్యునల్‌ సోమవారం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.ఫిబ్రవరి 12లోగా హసీనాతో పాటు మిగతా వారందర్నీ అరెస్ట్‌ చేయాలని ఐసీటీ తన ఆదేశాల్లో పేర్కొంది.

1971 లో బంగ్లా విముక్త పోరాటంలో అసువులు బాసిన వారి పిల్లలకు, మనవళ్లు,మనవరాళ్లకు 30 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10 శాతం స్థానిక పరిపాలన జిల్లాల వారికి 10 శాతం మహిళలకు ,5 శాతం మైనారిటీ తెగల వారికి, 1 శాతం దివ్యాంగులకు ఇస్తున్నారు. ఈ పద్దతిని సంస్కరించి..ప్రతిభ ఆధారంగా మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ బంగ్లాలోని ప్రధాన నగరాలైన  ఢాకా,రాజ్‌షాహీ, ఖుల్నా, చత్తోగ్రాంలలో గతేడాది జులై, ఆగస్టు నెలల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.

ఇవి హింసాత్మకంగా మారడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రధాని షేక్‌ హసీనా దేశాన్ని విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది.

Also Read: Sneha Reddy: అరెస్ట్ తర్వాత బన్నీ భార్య తొలి పోస్ట్ వైరల్.. అందులో ఏముందంటే?

Also Read: KTR: చిట్టినాయుడు శునకానందం పొందుతున్నాడు.. అరెస్టుపై కేటీఆర్ సంచలనం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు