Bangladesh: షేక్ హసీనా ప్రసంగాలపై బంగ్లాదేశ్‌లో నిషేధం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రసంగాలు ప్రసారం చేయకుండా ఆ దేశంలో బ్యాన్ విధించారు. ఆగస్టులో జరిగిన అల్లర్ల మాదిరిగానే ఇప్పుడు కూడా హసీనా ప్రసంగాల వల్ల సామాన్యులు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీటీ తెలిపింది.

New Update
sheik

బంగ్లాదేశ్‌లో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఆగస్టులో ఆదేశంలో విపరీతమైన అల్లర్లు చెలరేగాయి. ఇందులో వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీనికి కారణ మాజీ ప్రధాని షేక్ హసీనా అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆమెను ప్రధాని పదవి నుంచి తప్పించారు. ఈ కారణంగానే హసీనా దేశం విడిచి పారిపోయారు కూడా. ప్రస్తుతం ఆమె భారతదేశంలో తలదాచుకున్నారు. అయితే దీని తర్వాత ఆమె బయటకు రానే లేదు. మీడియా ముందుకు కూడా రాలేదు. మరోవైపు బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రధానిగా ఉన్నారు. 

Also Read: చట్టాలంటే ప్రజలకు భయం, గౌరవం లేదు.. రోడ్డు ప్రమాదాలపై నితిన్ గడ్కరీ

మళ్ళీ అల్లర్లు చెలరేగే అవకాశం..

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అల్లర్లు పెద్దగా జరగడం లేదు. అక్కడక్కడా కొన్ని చోట్ల మాత్రం అల్లరి మూకలు చెలరేగుతున్నాయి. రీసెంట్‌గా స్కాన్ గురువుల మీద మైనారిటీలు దాడులు చేశారు. బంగ్లా ప్రభుత్వం కూడా వారిని అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి దేశంలో అల్లర్లు చెలరేగే ఛాన్స్‌ కనిపిస్తోందని అంటున్నారు. ఇలాంటి టైమ్‌లో మాజీ ప్రధాని షే హసీనా ప్రసంగాలు సామాన్యులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కారణంగానే బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రిబ్యునల్ హసీనా ప్రసంగాలపై నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె చివరిసారిగా న్యూయార్క్‌లోని తన మద్దుతదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అది సోషల్ మీడియాలో అప్పుడు చాలా వైరల్ అయింది. అవి ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తే కల్లోలం చెలరేగుతుంది. దీంతో ఐసీటీ.. హసీనా ప్రసంగాలు న్యాయపరమైన చర్యలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.. సాక్షులను, బాధితులను బెదిరించే ఛాన్స్ ఉందని పేర్కొనింది. ఇక, ఆమె విద్వేషపూరిత ప్రసంగాలను ప్రసారం చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. 

Also Read: పోలీస్ స్టేషన్ నుంచి హరీశ్‌ రావు విడుదల

తాను ఏర్పాటు చేసిన దానికి తానే బందీ..

అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే...ఈ ఇంటర్నేషల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిందే షేక్ హసీనా. 1971లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో జరిగిన దురాగతాలను విచారణ చేసేందుకు 2010లో మాజీ ప్రధాని షేక్ హసీనా ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేసింది. దీన్ని అనుకూలంగా చేసుకుని తన ప్రత్యర్థులైన పలువురు రాజకీయ నాయకులకు మరణ శిక్ష పడేలా హసీనా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇదే ఐసీటీ హసీనా మీద చర్యలకు దిగింది. 

Also Read: MH:డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారంలో శిండే సొంత ప్రసంగం..షాక్ అయిన నేతలు

Also Read: తెలంగాణలో 40 వేల కోట్ల విలువైన భూకబ్జా.. మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు