Mohammad Ghazanfar : ఆఫ్ఘన్ చరిత్ర రిపీట్ అయితే ..  పాకిస్థాన్‌కు ఆఫ్ఘన్ స్టార్ వార్నింగ్!

ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆడనున్న ఆఫ్ఘనిస్తాన్ యువ క్రికెట్ సంచలనం అల్లా మహమ్మద్ గజన్‌ఫర్, పాకిస్థాన్ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై జరిగిన దాడిపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ

New Update
afganistan

ముంబై ఇండియన్స్(mumbai-indians) తరపున ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్‌లో ఆడనున్న ఆఫ్ఘనిస్తాన్ యువ క్రికెట్ సంచలనం అల్లా మహమ్మద్ గజన్‌ఫర్(Mohammad Ghazanfar), పాకిస్థాన్ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై జరిగిన దాడిపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన  ఓ మీడియాతో పంచుకున్నారు.

ధ్వంసమైన ఆ ఆసుపత్రి కేవలం భవనం మాత్రమే కాదని, వేలాది మంది ప్రజలు తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తిరిగి పొందే ఒక ఆశ అని గజన్‌ఫర్ పేర్కొన్నారు. అక్కడ చికిత్స పొందుతున్న వారు అత్యంత పేదలని, సుమారు వెయ్యి నుండి రెండు వేల మంది రోగులు, వారిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఈ దాడి వల్ల రోడ్డున పడ్డారని ఆయన వాపోయారు. "డబ్బు లేని పేదలు చికిత్స పొందే చోటును కూడా లక్ష్యంగా చేసుకోవడం, అమాయకులను బలితీసుకోవడం ఆఫ్ఘన్ ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

Also Read :  సన్‌రైజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ గా అభిషేక్ శర్మ.. కమ్మిన్స్ ఔట్..!

సామాన్య ప్రజలను లక్ష్యంగా

దురాండ్ లైన్ వెంబడి ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణంపై స్పందిస్తూ, పాకిస్థాన్ ఏం నిరూపించాలని అనుకుంటుందో అర్థం కావడం లేదని గజన్‌ఫర్ ప్రశ్నించారు. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఎవరికీ మేలు జరగదని, ఆఫ్ఘనిస్తాన్ చరిత్రను ఎవరూ మర్చిపోకూడదని ఆయన హెచ్చరించారు. "ఒకవేళ చరిత్ర గనుక పునరావృతమైతే అది పాకిస్థాన్‌కే చాలా నష్టం కలిగిస్తుందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ చెబుతున్న కారణాలకు, అక్కడ జరుగుతున్న వాస్తవాలకు పొంతన లేదని, ఇది ముమ్మాటికీ అన్యాయమని ఆయన మండిపడ్డారు.

ఈ క్లిష్ట సమయంలో భారత్‌ను తమ ప్త్రాణ స్నేహితుడిగా గజన్‌ఫర్ అభివర్ణించారు. ఇలాంటి దాడులు ఆగిపోవాలంటే భారత్ వంటి దేశాలు దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. "భారత్ మాకు అత్యంత సన్నిహిత దేశం. ఇటువంటి దారుణాలు జరగకుండా ఉండేందుకు వారితో కలిసి చర్చించాలని మేము కోరుకుంటున్నాము" అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇలాంటి దాడులు ఎవరికీ మంచిది కాదని చెబుతూ తన విజ్ఞప్తిని ముగించారు.

Also Read :  కావ్య మారన్ సంచలనం..  పాక్ ఆటగాడితో సన్‌రైజర్స్ ఒప్పందం

Advertisment
తాజా కథనాలు