BIG BREAKING: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి 15 మంది మృతి చెందారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్‌లో ఓ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
15 Workers Killed In Boiler Explosion in pakistan

15 Workers Killed In Boiler Explosion in pakistan

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి 15 మంది మృతి చెందారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్‌లో ఓ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. అయితే పేలుడు ఎలా జరిగింది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ ప్రమాదం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ ఫ్యాక్టరీ యజమాని పారిపోయాడు. చివరికి మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. 

Also read: కేరళలో మెదడు తినే అమీబా.. భయపడుతున్న అయ్యప్పలు.. అసలు ఈ వ్యాధి ఏంటి..? నిజంగా డేంజరేనా..?

ఆ ఫ్యాక్టరీలో భారీగా పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ఇల్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంపై పంజాబ్ సీఎం మరయం నవాజ్ షరీఫ్‌ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలాఉండగా పాకిస్థాన్‌లో అనేక పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను సరిగా పాటించరనే విమర్శలు ఉన్నాయి. అందుకే తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. 

Also Read: సిరియన్ హ్యాండ్లర్, టర్కీ సమావేశాలు, టెలీగ్రామ్ ట్యూటోరియల్స్..ఢిల్లీ బాంబు బ్లాస్ట్ పక్కా స్కెచ్

గతేడాది కూడా అదే ఫైసలాబాద్‌లో మరో ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు వారం రోజుల క్రితమే కరాచీలో ఓ బాణసంచా తయారీ కంపెనీలో కూడా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే వరుసగా ఇలా పాక్‌ ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరగడంతో అక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీ యజమానులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు