నేరగాళ్ల కొత్త ట్రిక్.. న్యూ ఇయర్ విషెష్ అంటూ..

న్యూ ఇయర్ విషెష్ అంటూ కొత్త ట్రిక్‌తో సైబర్ నేరగాళ్లు దాడి చేస్తున్నారు. విషెష్ అంటూ ఏవైనా లింక్స్ వస్తే ఓపెన్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. పొరపాటున లింక్ ఓపెన్ చేస్తే ఇక మీ పర్సనల్ డేటా, బ్యాంక్ వివరాలు వారి చేతుల్లోకి వెళ్లిపోాతాయని చెబుతున్నారు.

New Update
Cyber Crime: నిరుద్యోగులకు రూ.35 కోట్లు  టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు.. అసలేం జరిగిందంటే..

అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు. నేరగాళ్లు రోజుకొక కొత్త రకం ట్రిక్‌తో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లకు లింకులు పంపించి దాన్ని క్లిక్ చేస్తే ఆఫర్స్ వస్తాయని చెప్పి.. వారి ఖాతా నుంచి డబ్బులు కొట్టేసేవారు.

ఇది కూడా చూడండి: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్‌..ఎంత వింతగా ఉందో చూడండి!

మరో కొత్త ట్రిక్‌తో..

దీని గురించి పోలీసులు ప్రజల్లో అవగాహన తీసుకురావడంతో ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ పేరుతో మరో కొత్త మోసానికి తెరతీశారు. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు, సంపన్నులు, ప్రముఖ వ్యాపార, రాజకీయ, సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేసి దోచేవారు. ఇప్పుడేమో మరో కొత్త రకం ట్రిక్‌తో సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు.  

ఇది కూడా చూడండి: Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

న్యూ ఇయర్ విషెష్ చెబుతూ కొందరు సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు విషెష్ కార్డు వస్తుందని, మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసి ఇతరులకు పంపించవచ్చని వస్తున్నాయి. ఇలాంటి లింక్‌లను మీరు ఓపెన్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి లింక్‌లు క్లిక్ చేస్తే మొబైల్‌లో ఉన్న డేటా, పర్సనల్ డిటైల్స్, బ్యాంకు వివరాలు అన్ని కూడా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి.

ఇది కూడా చూడండి: Horoscope 2025: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే!

ఇంకా మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ అయిపోతాయి. కాబట్టి ఎవరూ కూడా న్యూ ఇయర్ విషెష్ లింక్స్ ఏవైనా వస్తే క్లిక్ చేయవద్దని అధికారులు చెబుతున్నారు. పొరపాటున క్లిక్ చేస్తే డబ్బులు కోల్పోతే మాత్రం.. వెంటనే 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయండి. 

ఇది కూడా చూడండి: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్‌ న్యూస్‌

Advertisment
Advertisment