నిజామాబాద్ జిల్లా (Nizamabad) లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న గల్ఫ్ ఏజెంట్ (Gulf Agent) సంపత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే సంపత్ మృతికి పోలీసులే కారణమంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కొట్టడంతోనే సంపత్ చనిపోయాడంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Also Read : ఇక ఓటీటీలో నవ్వులే నవ్వులు.. వచ్చేసిన 'బ్రహ్మ ఆనందం’
నకిలీ వీసాల కేసులో అరెస్ట్
కాగా నకిలీ వీసాల కేసులో పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాలలో శ్రీరామ్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నడుపుతున్నాడు సంపత్. అయితే దుబాయ్ పంపిస్తానని మోసం చేశాడని పలువురు యువకులు సంపత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో సంపత్‌కు రెండు రోజులు రిమాండ్ విధించింది. అయితే రిమాండ్ తరలిస్తుండగా సంపత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే సంపత్‌ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
Also Read : టార్గెట్ కేసీఆర్.. కేబినెట్లోకి రాములమ్మ.. హైకమాండ్ సంచలన వ్యూహం ఇదేనా?
సంపత్ మృతికి పోలీసులే కారణమంటూ
అక్కడ చికిత్స పొందుతూ సంపత్ మృతి చెందాడు. దీంతో సంపత్ మృతికి పోలీసులే కారణమంటూ ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. సంపత్ మృతిపై నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డిస్పందించారు. సంపత్ ఆసుపత్రిలోనే కుప్పకూలి చనిపోయాడని.. ఈ విషయాన్ని వైద్యులు కూడా చూశారన్నారు. రిమాండ్ ఖైదీ సంపత్ మృతి పై ఎంక్వయిరీ జరుగుతోందని చెప్పుకొచ్చారు.ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం చేస్తారని.. సంపత్ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Also Read : ఆరోగ్య శ్రీ రూల్స్ మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
సంపత్ మృతిపై స్పందించిన నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డి
— Telugu Galaxy (@Telugu_Galaxy) March 14, 2025
సంపత్ ఆసుపత్రిలోనే కుప్పకూలి చనిపోయాడు
వైద్యులు కూడా చూశారు
రిమాండ్ ఖైదీ సంపత్ మృతి పై ఎంక్వయిరీ జరుగుతోంది
ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం చేస్తారు. మృతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం#Telangana… pic.twitter.com/f2HZ6Cy2xn
Also read : Malla Reddy: మనల్ని ఎవడ్రా ఆపేది.. హోలీ వేడుకల్లో మల్లారెడ్డి రచ్చ!