Medipally : మేడిపల్లిలో ఘోర ప్రమాదం: కారు ఢీకొని దంపతుల మృతి, కుమారుడికి గాయాలు!

హైదరాబాద్ లో దారుణం జరిగింది. అతివేగం ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్నంత పని చేసింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మరణించగా, వారి కుమారుడు గాయాలతో బయటపడ్డాడు.

New Update
medipally

హైదరాబాద్(hyderabad) లో దారుణం జరిగింది. అతివేగం ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్నంత పని చేసింది. మేడిపల్లి(Medipally) పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మరణించగా, వారి కుమారుడు గాయాలతో బయటపడ్డాడు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. రాయనగర్‌కు చెందిన మర్రి ప్రశాంత్ (35), భార్య శ్రావణి (33), కుమారుడు సహస్రార్ (12)తో కలిసి బైక్‌పై మేడిపల్లిలోని తమ బంధువుల ఇంటికి వెళ్తున్నారు. పీర్జాదిగూడ డెకాథ్లాన్ సమీపంలోకి రాగానే, వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక కియా కారు వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది(road accident). ఢీకొట్టడమే కాకుండా బైక్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలవడంతో ప్రశాంత్  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతని భార్య శ్రావణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Also Read :  ఏలూరు MP పుట్టా మహేష్‌కు TDP షాక్.. పార్టీ కార్యక్రమాల నుంచి బహిష్కరణ

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స

వారి కుమారుడు సహస్రార్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోయి ఆ బాలుడు ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. ప్రమాదానికి కారణమైన కారు యజమాని రామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read :  జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిపై కాల్పులు

Advertisment
తాజా కథనాలు