సినిమా లెవెల్‌లో స్కెచ్.. ఆటో డ్రైవర్‌ హత్య

ఏపీకి చెందిన కారు డ్రైవర్ కుటుంబంతో కలిసి జగద్గిరిగుట్టలో నివసిస్తున్నాడు. ఏడో తరగతి చదవుతున్న తన కూతురిని ఓ ఆటో డ్రైవర్ సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి కిడ్నాప్ చేశాడు. దీంతో ఆ తల్లిదండ్రులు ఆటో డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారు.

New Update
annamaiah crime

సినిమాను తలపించేలా ఆటో డ్రైవర్‌‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన దారుణ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన ఓ కారు డ్రైవర్ కుటుంబం జగద్గిరిగుట్టలో ఉంటున్నాడు. ఇతనికి ఏడో తరగతి చదువుతున్న ఓ కూతురు ఉంది. ఈ అమ్మాయిని కుమార్ అనే ఓ ఆటో డ్రైవర్ సినిమా ఆఫర్లు ఇస్తానని నమ్మించాడు. 

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి

బాలికను నిర్భంధించి..

దీంతో అతన్ని నమ్మిన ఆ బాలికను కుమార్ కిడ్నాప్ చేసి యూసఫ్‌గూడలో ఓ గదిలో నిర్భింధించి లైంగివ వేధింపులకు గురి చేశాడు. ఆ తర్వాత బాలిక తప్పించుకుని పారిపోయింది. అయితే ఆ బాలిక ఎక్కడికీ వెళ్లిందో ఆచూకీ కూడా తెలియలేదు. దీంతో ఆ ఆటో డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేయాలని బాలిక తల్లిదండ్రులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో స్నాప్ చాట్‌తో తన భార్య సహకారంతో ఆటో డ్రైవర్‌ను హనీ ట్రాప్ చేశారు.

ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు

మాయ మాటలు చెప్పి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లారు. తమ కూతురు గురించి చెప్పమని కొట్టారు. కూతురు తప్పించుకుని వెళ్లిపోయిందని చెప్పిన కూడా తల్లిదండ్రులు వినలేదు. గట్టిగా కొట్టడంతో ఆ ఆటో డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతన్ని నాగార్జున సాగర్ కాలువలో పడేశారు. దీంతో కుమార్ కనిపించడంలేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఆటో డ్రైవర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్

ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు