/rtv/media/media_files/2026/03/18/vaishu-2026-03-18-07-47-13.jpg)
ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి(Youtuber Vaishnavi Incident) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి(19), కోరుట్ల పట్టణం ఏసుకోనిగుట్టకు చెందిన చిత్తరి హరిబాబు(26) 8 నెలల కింద పెళ్లి అయింది. ఇద్దరిది ప్రేమ వివాహం.
వీరిద్దరూ మాదాపూర్‌లోని అత్తింట్లో నివాసం ఉంటున్నారు. వైష్ణవి యూట్యూబర్(YouTuber Vaishnavi) గా ఉండేవారు. నాలుగు నెలల ప్రెగ్నెంట్ కూడా. అయితే కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వరకట్నం కోసం వైష్ణవిని హరిబాబు కొంతకాలంగా వేధించాడని పోలీసులు చెబుతున్నారు, ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని వెల్లడించారు. అర్ధరాత్రి తర్వాత హరిబాబు వైష్ణవి గొంతు నులిమి, చేతులు, నుదిటిపై కత్తితో పొడిచి హత్య చేసినట్లుగా చెప్పుకొచ్చారు. అనంతరం బైకు మీద పారిపోయాడని తెలిపారు.
ఆదివారం ఉదయం ఎంతసేపటికీ వైష్ణవి గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా, ఆమె విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైష్ణవి ఇక లేదన్న వార్త తెలియగానే ఆమె ఛానల్ సబ్ స్క్రైబర్లు కూడా షాక్ కు గురవుతున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నామని.. వైష్ణవి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
Also Read : ఎంత పనిచేశావ్ రా.. లీవ్ ఇవ్వలేదని మేనేజర్‌ను కాల్చి చంపేసిన సెక్యూరిటీ గార్డు
అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి
వైష్ణవి గర్భం దాల్చినప్పటి నుండి అబార్షన్ చేయించుకోవాలని హరిబాబు ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, దీనిపై గతంలో పంచాయితీ కూడా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం వైష్ణవి యూట్యూబ్ ఛానల్‌లో గతంలో పోస్ట్ చేసిన వీడియోలు చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ప్రాంక్ పేరుతో గతంలో భార్యాభర్తలు గొడవ పడుతున్నట్లు చేసిన వీడియోలన్నీ నిజమైన గొడవలేనా అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నిండు ప్రాణాన్ని, పుట్టబోయే బిడ్డను బలి తీసుకున్న ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Also Read : గ్యాస్ సిలిండర్ల దొంగతనం.. 9 మంది పోలీసులు సస్పెండ్
Follow Us